Breaking : పట్టాలు తప్పిన రైలు.. 50 మందికి పైగా..

ప్రతీకాత్మక చిత్రం

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. నిర్గుండి వద్ద ముంబై భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది.

  • Share this:
    ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. నిర్గుండి వద్ద ముంబై భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ కారణంగా 50 మందికి పైగా గాయపడ్దారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స కోసం కటక్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: