కరోనా వైరస్ భారత్‌లో ఇన్ని కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేస్తోంది...

ప్రపంచంలోని పలు దేశాల్లో విధించిన ఫుల్ లాక్ డౌన్, పాక్షిక లాక్ డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 బిలియన్ల కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పారు.

news18-telugu
Updated: April 8, 2020, 2:21 PM IST
కరోనా వైరస్ భారత్‌లో ఇన్ని కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేస్తోంది...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలోని 40 కోట్ల మందిని కరోనా వైరస్ పేదరికంలోకి నెట్టేయగలదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 2.7 బిలియన్ల మంది కార్మికుల మీద ప్రభావం చూపిస్తుందని ఐఎల్ఓ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. కోవిడ్ 19 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత కార్మికుల మీద ప్రభావం చూపిస్తోంది. భారత్, బ్రెజిల్, నైజీరియాల్లో లాంటి దేశాల్లో ఉండే అసంఘటిత కార్మికులు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని ఆ నివేదిక అంచనా వేసింది. భారత్‌లో 90 శాతం మంది అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. అందులో సుమారు 40 కోట్ల మంది మీద కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం చూపనుందని అంచనా. భారత్‌లో విధించిన లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది ప్రజలు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వలసలు పోతున్నారని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ 19 గవర్నమెంట్ స్ట్రాటజీ ఇండెక్స్ అభిప్రాయపడినట్టు ఐఎల్ఓ తెలిపింది.

ప్రపంచంలోని పలు దేశాల్లో విధించిన ఫుల్ లాక్ డౌన్, పాక్షిక లాక్ డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 బిలియన్ల కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పారు. అది ప్రపంచంలోని 81 శాతం మంది అసంఘటిత కార్మికులతో సమానం. ఇప్పటికే పలు దేశాల్లో ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు పని వేళల మార్పులు, సెలవులు ప్రకటించడాలు కూడా చేస్తున్నాయి కంపెనీలు. దీన్ని బట్టి అంచనా వేస్తే ఏప్రిల్ 1 వరకు చూస్తే, 2020 రెండో త్రైమాసికంలో 6.7 శాతం పనిగంటలు తగ్గుతాయని అంచనా వేసింది.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading