వామ్మో... ఏసీలో ఒకటి కాదు రెండు కాదు.. 40 పాము పిల్లలు

ఆ పామును పట్టుకుని బయటికి తీసుకెళ్లి వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత నిద్రించేందుకు మరోసారి తన గదికి వెళ్లాడు. అతడి మంచంపై మరో మూడు పాములు కన్పించాయి.

news18-telugu
Updated: June 4, 2020, 10:50 AM IST
వామ్మో... ఏసీలో ఒకటి కాదు రెండు కాదు.. 40 పాము పిల్లలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరట్‌లో ఓ ఎయిర్ కండీషనర్ నుంచి 40 పాము పిల్లలు బయటపడిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మీరట్ జిల్లాలోని పావ్లీఖుర్ద్ గ్రామంలో శ్రద్ధానంద్ అనే రైతు తన గదిలో సోమవారం రాత్రి ఓ పామును చూశాడు. ఆ పామును పట్టుకుని బయటికి తీసుకెళ్లి వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత నిద్రించేందుకు మరోసారి తన గదికి వెళ్లాడు. అతడి మంచంపై మరో మూడు పాములు కన్పించాయి. దీంతో సదరు రైతు ఆ పాములను చంపేందుకు ప్రయత్నిస్తుండగా, అతడి గదిలోని ఎయిర్ కండీషనర్ వైపు అతడి చూపు పడింది. అక్కడ ఉన్న ఏసీ నుంచి పాములు కిందకు దిగుతుండడాన్ని గమనించాడు.

వెంటనే కొంతమంది స్థానికుల సాయంతో ఏసీలో 40 పాములను పట్టుకున్నారు. ఓ సంచిలో పాములన్నింటిని వేసుకుని.. దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై పశువైద్యుడు డాక్టర్ ఆర్కే వత్సల్ స్పందిస్తూ.. ఏసీని గత కొన్ని నెలలుగా వినియోగించలేదని, దాంతో పాము అందులో గుడ్లు పెట్టి ఉండొచ్చన్నారు. తాజాగా అవన్ని బయటకు వచ్చినట్టు చెప్పారు.
Published by: Narsimha Badhini
First published: June 4, 2020, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading