Home /News /national /

4 YEARS GIRL DIES AFTER SWALLOWING FIVE RUPEE COIN IN BHOODHAN POCHAMPALLY IN YADADRI DISTRICT IN TELANGANA PAH

చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల కాయిన్.. అసలేం జరిగిందంటే..

చిన్నారి పాప చైత్ర (ఫైల్)

చిన్నారి పాప చైత్ర (ఫైల్)

Yadadri district: తెలంగాణాలోని యాదాద్రి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. నాలుగెళ్ల చిన్నారి ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్ ను మింగింది. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

మన ఇళ్లలో చిన్నారులను కంటికి రెప్పలాగా చూసుకొవాలి. ఒక్క నిముషం కూడా వారి పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న రెప్పపాటులో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అప్పటి వరకు ఆనందంతో , ఉల్లాసంగా ఆడుకున్న పిల్లలు విగత జీవులుగా మారిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు..  భూదాన్ పోచంపల్లి జిల్లాలో (bhoodhan pocham pally)  తీవ్ర విషాదకర సంఘటన వెలుగులోనికి వచ్చింది. బొంగు మహేష్, సరితా లకు ఒక ఇద్దరు బిడ్డలు. అయితే, కొన్నిరోజుల క్రితం.. చిన్న పాప చైత్ర ఇంట్లో ఆడుకుంటూ ఐదు రూపాయల (swallowing five rupee coin)  కాయిన్ మింగింది. నొప్పిని భరించలేక (4 years girl dies)  బాలిక విలవిల్లాడింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి కాయిన్ ను బైటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు గండం గట్టేకిందని అనుకున్నారు.

కానీ అంతలోనే మరో ఘటన జరిగింది. బాలికకు గొంతులో నొప్పి ఏర్పడింది. వెంటనే ఆమెను ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స చేస్తుండగానే బాలిక తనువు చాలించింది. దీంతో బాలిక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్నారి కన్నవారిని ఓదార్చడం ఏవరి తరం కాలేదు. ప్రస్తుతం ఈ విషాద కర ఘటనతో స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రముఖ సూఫీగురువు దారుణ హత్యకు గురయ్యారు.

మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్‌లో దారుణ ఘటన జరిగింది. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల ముస్లిం ఆధ్యాత్మిక గురువు.. సయ్యద్ చిస్తీ గత కొంత కాలంగా నాసిక్ లో ఉంటున్నారు. అక్కడ ప్రజలకు మతం పట్ల బోధనలు (Muslim Spiritual Leader) చేస్తుండేవారు. ఈ క్రమంలో బుధవారం ఆయన దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సయ్యద్ చిస్తీ నాసిక్‌లోని యోలా పట్టణంలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ఆయనను చుట్టుపక్కల ఉంటే ప్రజలు ఎంతో విశ్వసిస్తారు. ఆయన ముంబై పట్టణానికి 200 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో హత్యకు గురయ్యాడు. ఆయన డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు పోలీసులకు తెలిపారు.

ఆయన తలపై బుల్లెట్ గాయాలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. సయ్యద్.. ఆఫ్ఘనిస్థాన్‌ పౌరుడు కావడం వలన భూములు కొనలేక పోయాడు. దీంతో స్థానికుల పేరు మీద భూములు కొనుగోలు చేశారని పలువురు అనుమానిస్తున్నారు. భూములకు సంబంధించిన లావాదేవీల గొడవల వలన డ్రైవర్ హత్య చేసి ఉండోచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికలంగా తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Telangana News, Yadadri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు