హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అన్నదాతల ఆకలి తీర్చుతూ.. అందరి హృదయాలను గెలిచిన బుడ్డోడు..

అన్నదాతల ఆకలి తీర్చుతూ.. అందరి హృదయాలను గెలిచిన బుడ్డోడు..

రైతులకు పళ్లు, బిస్కెట్లు పంచుతున్న చిన్నారి

రైతులకు పళ్లు, బిస్కెట్లు పంచుతున్న చిన్నారి

Farmers Protest: రైతుల ఆందోళనల్లో ఓ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రోడ్లపై ఆందోళనలు చేస్తున్న రైతులకు ఆహారం అందజేస్తూ అందరి హృదయాలను గెలిచాడు.

Farmers Protest: ఢిల్లీ శివారులో 21 రోజులుగా రైతుల ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సంఘాలకు చెందిన వేలాది మంది రైతులురోడ్లపై బైఠాయించి నిరసనల్లో పాల్గొంటున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు, కుటుంబాలకు వదిలేసి రోడ్లకే పరిమితమయ్యారు. అక్కడే తింటున్నారు. అక్కడే పడుకుంటున్నారు. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్ధల వారు అన్న పానీయాలను అందజేస్తున్నాయి. మొబైల్ టాయిలెట్లు వంటి వసతులను కల్పిస్తున్నాయి. ఐతే ఈ రైతుల ఆందోళనల్లో ఓ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రోడ్లపై ఆందోళనలు చేస్తున్న రైతులకు ఆహారం అందజేస్తూ అందరి హృదయాలను గెలిచాడు.

బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన మెహ్తాబ్ ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రైతు కుటుంబానికి చెందిన మెహ్తాబ్.. ఢిల్లీ శివారులో రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రాంతానికి ఇటీవలే వెళ్లాడు. తన వెంట 4 ఏళ్ల తన కుమారుడిని కూడా తీసుకెళ్లాడు. అక్కడ రైతులకు పాలు, పళ్లు, బిస్కెట్లు పంపణీ చేశారు. తండ్రితో పాటు ఆ బాలుడు కూడా రైతులకు అరటి పళ్లు, బిస్కెట్లు అందజేస్తూ మీడియాకు కనిపించాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వయసు చిన్నదైనా.. మనసు చాలా పెద్దదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

''ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారి వద్దకు వెళ్లి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. నాకు నెలకు రూ.20వేల జీతం వస్తుంది. అందులో నుంచి కొంత డబ్బుతో పాలు, పళ్లు, బిస్కెట్లు కొని రైతులకు పంచుతున్నాం. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా నాన్న చూస్తే ఎంతో గర్వపడతారు. ఎందుకంటే మా నాన్న కూడా ఓ రైతే'' అని మెహ్తాబ్ పేర్కొన్నారు.

కాగా, రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. వారి ఉచ్చులో రైతులు పడవద్దని కోరుతోంది. ఐతే డిసెంబరు 19లోపు చట్టాలను రద్దు చేయాలని.. లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.

First published:

Tags: Delhi, Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు