హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో భీకర కాల్పులు.. టెర్రరిస్టులు హతం.. వీడియో

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో భీకర కాల్పులు.. టెర్రరిస్టులు హతం.. వీడియో

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jammu Kashmir Encounter: ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీస్‌కు గాయాలవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. జమ్మూలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై బాన్ టోల్‌ప్లాజా వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీస్‌కు గాయాలవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

  జమ్మూలోకి ఉగ్రవాదులు వస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే భద్రతా బలగాలను హెచ్చరించాయి. ఆ సమాచారంతోనే బాన్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంతా తనిఖీ చేయడంతో..భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టెర్రరిస్టుల వాహనంపై తూటాల వర్షం కురిపించారు. ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.  ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ హైవేను తాత్కాలికంగా మూసివేశారు. నగ్రోతా నుంచి ఉదమ్‌పూర్ వరకు వాహనాలను అనుమతించడం లేదు. మరికొందరు ఉగ్రవాదులు కూడా ఉండొచ్చన్న అనుమానంతో జమ్మూలో తనిఖీలను ముమ్మరం చేశారు. చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Encounter, Jammu and Kashmir, Terror attack

  ఉత్తమ కథలు