హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారీ కుట్రకు ప్లాన్.. ట్రక్‌ల్లో దాగిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రత బలగాలు

భారీ కుట్రకు ప్లాన్.. ట్రక్‌ల్లో దాగిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రత బలగాలు

టెర్రరిస్టులు దాగిన ట్రక్(ఫొటో-Twitter/ANI)

టెర్రరిస్టులు దాగిన ట్రక్(ఫొటో-Twitter/ANI)

ట్రక్‌లో దాగిన నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవే‌పై నాగ్రోటా సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

  ట్రక్‌లో దాగిన నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవే‌పై నాగ్రోటా సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి కూడా గాయపడినట్టుగా అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కశ్మీర్ లోయ వైపు ప్రయాణిస్తున్నారని, వారు భారీ కుట్రకు ప్లాన్‌ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు.. సాంబా సెక్టార్ నుంచి నాగ్రోటా టోల్ ప్లాజా వైపు ఉగ్రకదలికపై ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. గురువారం వేకువజామున ఉగ్రవాదలు ప్రయాణిస్తున్న ట్రక్ జమ్మూ నగర శివార్లలోని నాగ్రోటా‌లోని బాన్ టోల్ ప్లాజా వద్దకు చేరింది.

  ఆ వాహనాన్ని తనిఖీ చేపట్టిన పోలీసులు, సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఉదయం 5 గంటల సమయంలో వారిపై కాల్పులు జరిపారు. అప్పుడు వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే పోలీసులు రాకను ముందుగానే పసిగట్టిన ఆ ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇక, ఆ వాహనం నుంచి పెద్ద సంఖ్య‌లో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 11 ఏకే-47 రైఫిల్స్, మూడు తుపాకులు, 29 గ్రేనేడ్స్‌ ఉన్నాయి.

  భద్రత బలగాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్టు జమ్మూ జోన్ ఐజీపీ ముఖేష్ సింగ్ ధ్రువీకరించారు. ట్రక్ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. వారు డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలను టార్గెట్‌గా దాడులకు పాల్పడే అవకాశం ఉండిందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇదేనని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొసాగిస్తామని వెల్లడించారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Encounter, Jammu and Kashmir

  ఉత్తమ కథలు