news18-telugu
Updated: September 9, 2020, 9:10 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఒడిశాలోని కలహండిలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఒక జవాన్ గాయపడ్డారు. కందమాల్ బోర్డర్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. 8వ తేదీ నుంచి అడవిని జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఎస్ఓజీ, డీవీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. సుమారు గంటపాటు రెండు వైపుల నుంచి కాల్పులు జరిగాయి. అనంతరం ఘటన స్థలాన్ని భద్రతాబలగాలు పరిశీలించగా, నలుగురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులు, మూడు దేశవాళీ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు మరికొంత మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల వ్యక్తిగత సామగ్రి కూడా లభించింది. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ కూడా చనిపోయినట్టు అధికారులు తెలిపారు. బాధిత జవాన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో మరికొందరు మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని భావిస్తూ భారీ ఎత్తున బలగాలను అక్కడికి పంపిస్తున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 9, 2020, 9:10 PM IST