ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్... నలుగురు మావోయిస్టులు హతం

పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.

news18-telugu
Updated: July 6, 2020, 10:06 PM IST
ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్... నలుగురు మావోయిస్టులు హతం
ఘటనా స్థలంలో మావోయిస్టుల వస్తువులు
  • Share this:
ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టారు.

ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. పెద్ద మొత్తంలో సమావేశమయ్యారు. పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మరికొందరు తప్పించుకొని అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఘటనా స్థలంలో ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకీతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులను బంశధార-ఘుముసారా-నాగావళి (బీజీఎన్) డివిజన్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిపై గతంలో ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading