• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • 4 INDIAN SCIENTISTS CHALLENGING BIG BANG THEORY HERE IS FULL DETAILS SK GH

Big Bang Theory: బిగ్​ బ్యాంగ్​​ థియరీ తప్పు.. భారత శాస్త్రవేత్తల సంచలన పరిశోధన

ప్రతీకాత్మక చిత్రం

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో పేర్కొన్నట్లు ఎరుపు రంగు వైపుగా కదిలే ఖగోళ వస్తువు నిరంతరాయంగా కదలదని చెబుతున్నారు. వారి పరిశీలనలో ఖగోళ వస్తువు ఎరుపు రంగు వైపుకు నిరంతరాయంగా కదులుతుండటానికి విరుద్ధమైన స్వభావాన్ని కనుగొన్నారు.

  • Share this:
ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనే అంశంపై ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రశ్నపై ఇప్పటివరకు అంచనాలు తప్ప ఎటువంటి స్పష్టత లేదు. ఇటువంటి అంచనాల్లో ఎక్కువ మంది నమ్మేది బిగ్ బ్యాంగ్ థియరీనే. దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల కిందట... ఓ భారీ పేలుడు సంభవించి... అందులోంచీ నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, వాయువులు... ఇలా అనంత విశ్వం పుట్టిందనే అంచనాయే బిగ్​ బ్యాంగ్​ సిద్దాంతం. అందువల్ల, బిగ్ బ్యాంగ్‌ జరగక ముందు విశ్వం లేదని ఇన్నాళ్లూ శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే, బిగ్​బ్యాంగ్​ను లైట్​ స్పెక్ట్రం లేదా VIBGYORలో రెడ్​ షిఫ్ట్​ కదలికకు అనుగుణంగా పరిశీలిస్తారు. అయితే, భూమి నుంచి దూరంగా కదులుతోన్న ఒక ఖగోళ వస్తువు VIBGYOR రంగులతో కాంతిని వెదజల్లుతూ.. అత్యంత వేగంగా సూటిగా ఎరుపు రంగు వైపుకు కదులుతుంది. ఇప్పటివరకు బిగ్​ బ్యాంగ్​ థియరీ గురించి ఇదే ప్రచారంలో ఉంది. అయితే, భారతదేశానికి చెందిన నలుగురు శాస్త్రవేత్తలు దీనికి భిన్నమైన వాదనను తెరపైకి తెస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్​డ్​ స్టడీస్ (NIAS) ప్రొఫెసర్ సిసిర్ రాయ్, అహ్మదాబాద్​లోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్ట్ అరిందం మాల్, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ)కు చెందిన సర్బాని పాలిత్, ఉజ్జవల్ భట్టాచార్యలు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని సవాలు చేస్తున్నారు.

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో పేర్కొన్నట్లు ఎరుపు రంగు వైపుగా కదిలే ఖగోళ వస్తువు నిరంతరాయంగా కదలదని చెబుతున్నారు. వారి పరిశీలనలో ఖగోళ వస్తువు ఎరుపు రంగు వైపుకు నిరంతరాయంగా కదులుతుండటానికి విరుద్ధమైన స్వభావాన్ని కనుగొన్నారు. ఇది బిగ్​బ్యాంగ్​ సిద్ధాంతానికి భిన్నమైన పరిశీలనగా చెప్పవచ్చు. కాగా, వారి పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్​ జర్నల్​ ఆఫ్​ ఆస్ట్రానమీ అండ్​ ఆస్ట్రోఫిజిస్​లో ప్రచురించబడ్డాయి.

బిగ్​ బ్యాంగ్​పై గతంలోనూ అనేక భిన్న వాదనలు:
తమ పరిశోధనలో రెడ్​ షిప్ట్​ నిరంతరాయంగా ఏకరీతి పద్ధతిలో మారడంలేదని పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై అధ్యయనవేత్త ప్రొఫెసర్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా, విశ్వం విస్తరణతో తరంగదైర్ఘ్యంలో మార్పులు జరుగుతుంటాయి. దీంతో రెడ్​ షిప్ట్​ నిరంతరాయంగా, ఏకరీతిగా మారుతుండాలి. కానీ, మా పరిశోధనలో దీనికి విరుద్ధంగా జరిగింది. స్లోన్ డిజిటల్ స్కై సర్వే (SDSS) DR12 ద్వారా సేకరించిన డేటా విశ్లేషణ చేయగా గెలాక్సీ, క్వాసార్​లు ఎరుపు రంగు మార్పుల ఆవర్తనను చూపించాయి.” అని చెప్పారు.

కాగా, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని సవాలు చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఇదివరకు స్టడీ స్టేట్ థియరీ, గ్రావిటేషనల్ లెండింగ్ మోడల్, టైర్డ్ ఫోటాన్ హైపోథెసిస్, వేరియబుల్ మాస్ హైపోథెసిస్ అన్నీ గతంలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని సవాలు చేశాయి. తాజాగా, నోబుల్​ పురస్కార గ్రహీత రోజర్ పెన్రోజ్ కూడా బిగ్​ బ్యాంక్​ థియారీకి పూర్తి భిన్నవైన వాదనను తెరపైకి తెచ్చారు. ఆయన స్పందిస్తూ.. "ఇప్పుడున్న విశ్వం విస్తరిస్తూ పోతోంది. ఇందులోని పదార్థమంతా చెల్లాచెదురుగా వెళ్లిపోతోంది. భవిష్యత్తులో మరో బిగ్ బ్యాంగ్ ఏర్పడి... మరో విశ్వానికి కారణమవుతుంది" అని అన్నారు. అంతేకాక, భవిష్యత్తులో జరగబోయే మరో బిగ్‌బ్యాంగ్‌కి ముందు మన విశ్వం ఉన్నట్లే... 1300 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన బిగ్ బ్యాంగ్‌కి ముందు కూడా ఓ విశ్వం ఉన్నట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు.
Published by:Shiva Kumar Addula
First published: