news18-telugu
Updated: April 4, 2019, 4:28 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికలవేళ ఛత్తీస్గఢ్ అడవులు రక్తమోడాయి. కాంకేర్ జిల్లా మహ్లా గ్రామ శివారులో గురువారం భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు BSF జవాన్లు చనిపోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతాదళాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మహ్లా గ్రామం వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న ఛత్తీస్గఢ్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంకేర్ సహా నక్సల్స్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.
Published by:
Shiva Kumar Addula
First published:
April 4, 2019, 4:07 PM IST