హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bharat Jodo yatra: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు.. నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..

Bharat Jodo yatra: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు.. నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..

రాహుల్​ గాంధీ (ఫైల్​)

రాహుల్​ గాంధీ (ఫైల్​)

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రంలో రాహుల్ గాంధీ వెంట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. వీరిని భారత్ యాత్రీస్ అని పిలుస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo yatra) నేటి నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలయ్యే ఈయాత్రం.. జమ్మూకాశ్మీర్ వరకు సాగుతుంది. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలల్లో 148 రోజుల పాటు సాగుతుంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi)సుమారు 3,570 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దేశంలో మతోన్మాదం, విభజన రాజకీయాలు, ద్రోవ్యోల్పణ, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలన్న లక్ష్యంతోనే భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాను రాహుల్ గాంధీ ఎండగడతారని తెలిపింది. ఒక అడుగు నీది.. ఒక అడుగు నాది.. యాత్రలో చేరి మనందరం భారత్‌ను ఏకం చేద్దాం నినాదంతో.. ఈ పాదయాత్ర సాగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదని.. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఎక్కడా కాంగ్రెస్ గుర్తును పెట్టలేని వెల్లడించారు.

OMG: సమోసాను చేతిలో ఇచ్చాడని.. ఏకంగా సీఎం కు ఫోన్.. ఎక్కడో తెలుసా..

ఇవాళ తమిళనాడులోని శ్రీపెరుంబదూర్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మోమోరియల్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం కన్యాకుమారిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కూడా హాజరవుతారు. సభ అనంతరం.. రాహుల్ గాంధీకి సీఎం స్టాలిన్ జెండా అందిస్తారు. ఆ జెండాను ఊపి రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తారు. మొదట రాహుల్ గాంధీతో పాటు 50 మంది నేతలు పాదయాత్రలో పాల్గొంటారు. మార్గమధ్యలో ఆయా రాష్ట్రాల నేతలు కలుస్తారు. ఈ యాత్ర తెలంగాణలో కూడా ఉంటుంది. కన్యాకుమారి నుంచి కొచ్చి, మైసూరు, బళ్లారి, వికారాబాద్ , నాందేడ్, ఇండోర్, కోటా, అల్వార్, బులంద్ షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్ కోట్, జమ్మూ మీదుగా శ్రీనగర్ వరకు సాగుతుంది. ప్రతి రోజూ రెండు విడతల్లో యాత్ర ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 03.30 గంటల నుంచి సాయంత్రం 06.30 వరకు ఉంటుంది. ప్రతిరోజూ సగటున 25 కి.మీ. సాగుతుంది.

 సీటు బెల్టు పెట్టుకొకుంటే ఇక నుంచి భారీ జరిమాన.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే..

భారత్ జోడో యాత్రంలో రాహుల్ గాంధీ వెంట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. వీరిని భారత్ యాత్రీస్ అని పిలుస్తున్నారు. ఏపీ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి కేతూరి వెంకటేశ్, సంతోష్, కే.వెంకటరెడ్డి, కత్తి కార్తీక, బెల్లయ్య నాయక్ అనులేఖ రాహుల్ తో పాటు ముందుకు సాగుతారు. వివిధ రాష్ట్రాల నుంచి 32 మంది మహిళలకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. యాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడా హోటల్‌, ఏసీ బస్సుల్లో బస చేయరు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే ఆయన బస చేస్తారు. పాదయాత్రలో సభలు, సమావేశాలు ఉంటాయి. ఇందులో పలు చోట్ల సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారు.

First published:

Tags: Congress, National News, Rahul Gandhi

ఉత్తమ కథలు