హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Char Dham Yatra: చార్ ధామ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? 12 రోజుల్లో 31 మంది భక్తులు మృతి.. బీ కేర్‌ఫుల్

Char Dham Yatra: చార్ ధామ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? 12 రోజుల్లో 31 మంది భక్తులు మృతి.. బీ కేర్‌ఫుల్

Char Dham Yatra: భక్తుల రద్దీ నేపథ్యంలో చార్ ధామ్ ఆలయాల్లో కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరూ అక్కడికి వెళ్లలేరు.

Char Dham Yatra: భక్తుల రద్దీ నేపథ్యంలో చార్ ధామ్ ఆలయాల్లో కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరూ అక్కడికి వెళ్లలేరు.

Char Dham Yatra: భక్తుల రద్దీ నేపథ్యంలో చార్ ధామ్ ఆలయాల్లో కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరూ అక్కడికి వెళ్లలేరు.

పవిత్ర చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)లో మృతి చెందుతున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 12 రోజుల్లోనే 31 మంది భక్తులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ కారణాలతో వీరంతా మరణించినట్లు ఉత్తరాఖండ్ హెల్త్ డీజీ డాక్టర్ శైలజా భట్ తెలిపారు. అధిక రక్తపోటు (High Blood pressure), గుండె పోటు (Heart Attack), మౌంటైన్ సిక్‌నెస్ (Mountain Sickness) కారణంగా ఎక్కువ మంది చనిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. గంగోత్రి (Gangotri), యమునోత్రి (Yamunotri), బద్రీనాథ్ (Badrinath), కేదార్‌నాథ్‌ (Kedarnath)కు వెళ్లే మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. యాత్రా సమయంలో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

ఛార్ ధామ్ యాత్రను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాల సందర్శనే చార్ ధామ్ యాత్ర. ఉత్తరాఖండ్‌లోని హిమగిరుల్లో కొండకోనలు, వాగులు వంకల గుండా ఇది సాగుతుంది. ఇది ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు.. సాహస యాత్ర కూడా..! అందుకే ఏటా లక్షలాది భక్తులు చార్ ధామ్ యాత్ర చేస్తుంటారు. కరోానా వల్ల గత రెండేళ్లుగా ఇక్కడ ఆంక్షలున్నాయి. అందుకే తక్కువ సంఖ్యలో మాత్రమే వెళ్లారు. కానీ ఈసారి ఆంక్షలను సడలించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రధాన ఆలయాలకు వెళ్లే అన్ని మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరుకైన దారుల్లో భక్తుల పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి.

Explained: పూరీ జగన్నాథ్ ఆలయ కారిడార్‌పై వివాదం.. ASI, ఒడిశా మధ్య గొడవకు కారణాలివే

2019లో అంటే కరోనా కాలానికి ముందు.. 6 నెలల్లో 9 లక్షల 26 వేల మంది కేదార్‌నాథ్‌ను సందర్శించారు. 2020లో మాత్రం భక్తుల సంఖ్య తగ్గింది. మొత్తం సీజన్‌లో 2 లక్షల 20 వేల మంది మాత్రమే సందర్శించారు. ఆ తర్వాత 2021లో 2 లక్షల 42 వేల మంది చార్ ధామ్ యాత్ర చేశారు. ఇక ఈసారి యాత్ర ప్రారంభమైన 7 రోజుల్లోనే కేదార్‌నాథ్‌ను లక్ష 32 వేల మంది సందర్శించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో గందరగోళం నెలకొంది. కొందరు భక్తుల యాత్ర మధ్యలో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చార్ ధామ్ యాత్ర మార్గాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే ఇప్పటి వరకు మరణించిన వారంతా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారేనని అధికారులు చెప్పారు.

PM Modi: మరోసారి ప్రధాని పదవి చేపట్టడంపై నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా జరిగిందంటూ..

ఈ క్రమంలోనే చార్ ధామ్ ఆలయాల్లో కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరూ అక్కడికి వెళ్లలేరు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు.. కేదార్‌నాథ్‌లో ఆలయం తెరిచే సమయాన్ని పొడిగించారు. ఇప్పుడు రాత్రి 10 తర్వాత కూడా భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకోవచ్చు. రద్దీ పెరిగినప్పుడు... సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్, గుప్తకాశీ, రుద్రప్రయాగ్ వంటి ప్రాంతాల్లో మాత్రమే భక్తులను నిలిపివేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వారిని ముందుకు పంపుతున్నారు. ఏదేమైనా పూర్తి ఫిట్‌గా ఉన్న వారు మాత్రమే యాత్రకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Badrinath, Char dham Yatra, Kedarnath, Uttarakhand

ఉత్తమ కథలు