ఇది వ్యూహకర్తల కాలం... నేతలను నడిపిస్తున్నది వాళ్లే... దేశవ్యాప్తంగా 300 కన్సల్టెన్సీలు

Lok Sabha Elections 2019 : వ్యూహ కర్తల ప్రణాళికలను నేతలు అమలు చేస్తున్నారు. వాళ్లు చెప్పిందే వేదంగా నడుచుకుంటున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 5:58 PM IST
ఇది వ్యూహకర్తల కాలం... నేతలను నడిపిస్తున్నది వాళ్లే... దేశవ్యాప్తంగా 300 కన్సల్టెన్సీలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం... తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారాలు... ఇంటింటికీ తిరుగుతున్న అభ్యర్థులు... గెలుపు కోసం ఎవరికి వాళ్లే సరికొత్త ఎత్తుగడలు... అయితే ఈ పార్టీలు, అభ్యర్థుల వెనక వ్యూహాలు రచించేవారు కొందరున్నారు. ఎన్నికల సమాచారాన్ని సేకరించడం, నియోజకవర్గాల్లో డేటా సేకరించడం, విశ్లేషించడం, సమీక్షించడం, ట్రెండ్‌కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ... తెరవెనక వాళ్లు చేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్తలు, పొలిటికల్ కన్సల్టెంట్ సంస్థల ప్రతినిధులు రోజుకు 12-14 గంటలపాటూ పనిచేస్తున్నా్రుు. తమ అభ్యర్థి గెలుపుకోసం వీలైనంతగా ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో సహాయకులుగా ఉంటున్నారు. వాళ్లతోపాటూ... పరిశోధకులు, డిజిటల్ మార్కెటింగ్ వారు, విశ్లేషకులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం దేశ ప్రచార విధానాలు మారాయి. ఇదివరకట్లా జోరు ప్రచారం, అడ్డగోలు హామీలు ఇచ్చి ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నించట్లేదు. ఎన్నికల్లో గెలవాలంటే ఇవి మాత్రమే సరిపోవని నేతలు గుర్తించారు. రాజకీయ విశ్లేషకులు, కన్సల్టెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యూహకర్తల విషయంలో బీహార్‌కి చెందిన ప్రశాంత్ కిషోర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన బృందం ఐప్యాక్ అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. ఆయన్ని చూసి ఇప్పుడు చాలా సంస్థలు అలాంటివి పుట్టుకొచ్చాయి.


2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 150 రాజకీయ కన్సల్టెన్సీలు పనిచేశాయి. ఇప్పుడా సంఖ్య 300కు చేరింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కన్సల్టెన్సీలు వివిధ రాజకీయా పార్టీలు, నేతల కోసం పనిచేస్తున్నాయి. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి, ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోవాలి, గెలుపుకోసం ఏం చెయ్యాలనే అంశాల్ని వివరిస్తున్నాయి.

లీడ్ టెక్ అనే సంస్థ దేశంలో 1000కి పైగా ప్రచారాలు చేయించి, విజయం సాధిస్తోంది. ఈ సంస్థ చేయిస్తున్నది ఒక్కటే... అభ్యర్థులను ఇంటింటికీ వెళ్లేలా చేయిస్తోంది. తీరా లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి ఈ సంస్థ రూట్ మార్చింది. ఇంటింటికీ తిరగాలంటే టైమ్ సరిపోదంటూ... పరోక్ష ప్రచారం చేయిస్తోంది. మీడియాను బాగా ఉపయోగించుకోమని సలహాలిస్తోంది.
ఈ సంస్థలు తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వ్యూహాలు అందిస్తున్నాయి. సపోజ్ ఓ దుర్ఘటన జరిగితే... దాని చుట్టూ ప్రసంగాలు, దాని చుట్టూ విమర్శలు, కౌంటర్లు ఉండేలా వ్యూహాలు పన్నుతున్నాయి. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలు, ఓటు బ్యాంకును బట్టీ స్పందించేలా అభ్యర్థికి వ్యూహాలు సూచిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల కోసం జాతీయ స్థాయి అంశాల్నీ, అంతర్జాతీయ అంశాల్నీ, సరిహద్దు దేశాలతో సంబంధాలు, వాణిజ్యం, ఉద్యోగాలపై ఎక్కువగా వ్యూహాలు రచిస్తున్న కన్సల్టెన్సీలు... రాష్ట్రాల్లో ఎన్నికల కోసం స్థానిక సమస్యలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. మొత్తానికి గెలుపు కోసం ఇలా కన్సల్టెన్సీలు చెప్పినట్లు రాజకీయ నేతలు, పార్టీలూ నడుచుకునే పరిస్థితి వచ్చేసింది.

 
Loading...
ఇవి కూడా చదవండి :

AP Elections 2019: ఒకే పార్టీ..ఒకే టికెట్..ఒకే స్థానం..నామినేషన్‌ వేసిన ముగ్గురు అభ్యర్థులు

AP Elections: కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు

ఏపీకి క్యూకట్టిన జాతీయ నేతలు..టీడీపీకి మద్దతుగా ప్రచారం..ఇదీ షెడ్యూల్
First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com