30 ఏళ్ల మహిళ... తొమ్మిదేళ్ల క్రితమే పెళ్లయింది.. ఇప్పుడు పురుషుడు అని తేలింది..

పుట్టినప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా సాధారణ జీవనం సాగించింది. తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లి కూడా చేసుకుంది. తీరా ఇప్పుడు చూస్తే ఆమె ‘పురుషుడు’ అని తేలింది.

news18-telugu
Updated: June 26, 2020, 4:40 PM IST
30 ఏళ్ల మహిళ... తొమ్మిదేళ్ల క్రితమే పెళ్లయింది.. ఇప్పుడు పురుషుడు అని తేలింది..
ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Pixabay)
  • Share this:
ఆమె వయసు 30 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా సాధారణ జీవనం సాగించింది. తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లి కూడా చేసుకుంది. తీరా ఇప్పుడు చూస్తే ఆమె ‘పురుషుడు’ అని తేలింది. చాలా విచిత్రంగా ఉన్న ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. బెంగాల్‌లోని బీర్భూమ్‌కి చెందిన ఆమెకు కొన్ని రోజులుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో కొన్ని పరీక్షలు చేయించుకుంది. ఎంతకూ తగ్గకపోవడంతో కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఓ సంచలన విషయం తెలిసింది. ఆమె వృషణాల్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయి. మహిళకు వృషణాలు ఉండడం ఏంటని ఆశ్చర్యపడొద్దు. జన్యుపరంగా ఆమెకు వృషణాలు కడుపులోనే ఉండిపోయాయట. వైద్య శాస్త్రంలోనే అద్భుతం అంటూ సినిమాల్లో చెప్పినా.. చాలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి.

‘మహిళకు ఉండే అన్ని లక్షణాలు ఆమెకు ఉన్నాయి. బయటకు మహిళగానే కనిపిస్తుంది. గొంతు, స్థనాలు, బయటకు కనిపించే అన్ని అంగాలు కూడా మహిళకు ఉన్నట్టే ఉన్నాయి. కానీ, ఇతర శరీర భాగాలు ఆమె అంతర్భాగంలోనే ఉండిపోయాయి. ఆమెకు రుతుస్రావం, బహిష్టు లాంటివి కూడా ఏమీ జరగలేదు.’ అని డాక్టర్ దత్తా పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. పూర్తిగా వృద్ధి చెందని వృషణాలు ఆమె కడుపులోనే ఉండిపోయాయి. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కాకపోవడం, స్త్రీల హార్మోన్లు సాధారణంగా ఉండడంతో ఆమె మహిళగా కనిపిస్తుంది.’ అని దత్తా చెప్పారు.

30 సంవత్సరాల నుంచి లేకుండా, ఇప్పుడు ఇలా సడన్‌గా ఈ విషయం తెలియడంతో బాధితురాలి రియాక్షన్ ఎలా ఉందని ప్రశ్నించగా, ‘ప్రస్తుతం కీమోధెరపీ కొనసాగుతోంది. భార్యాభర్తలు ఇద్దరకీ కౌన్సెలింగ్ ఇస్తున్నాం. గతంలో లాగా సాధారణంగానే జీవనం కొనసాగించాలని సూచించాం.’ అని డాక్టర్ చెప్పారు. గతంలో ఆమె పలుమార్లు గర్భం దాల్చినా అది నిలవలేదు. బాధితురాలి కుటుంబంలో ఇద్దరు మహిళలకు కూడా ఇదే సమస్య ఉన్నట్టు గతంలో గుర్తించారు. బహుశా జన్యుపరంగా ఆమెకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చని తెలిపారు.
First published: June 26, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading