హోమ్ /వార్తలు /జాతీయం /

జమ్ముకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు... నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు... నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

ముష్కరులు ఆ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు ... భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు.

    జమ్ముకాశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా లస్సిపోరా వద్ద భద్రత బలగాలు , ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు ఆ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు ... భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సమర్థవంతంగా టెర్రిస్టుల కాల్పులను తిప్పికొట్టిన భద్రతబలగాలు... నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. మరోవైపు ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయాలపాలయ్యారు. ఘటనాస్థలంలోని అధికారులు రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్, పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఘటనాస్థలంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాల్పలకు సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


    First published:

    Tags: Encounter, Indian Army, Jammu and Kashmir

    ఉత్తమ కథలు