బోర్డర్‌లో భీకర కాల్పులు...ముగ్గురు పాకిస్తాన్ సైనికులు హతం

పాకిస్తాన్ చేసిన ఎదురుదాడిలో ఐదుగురు భారత సైనికులు కూడా చనిపోయారని వెల్లడించారు. ఐతే పాకిస్తాన్ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ ఖండించింది.

news18-telugu
Updated: August 15, 2019, 7:07 PM IST
బోర్డర్‌లో భీకర కాల్పులు...ముగ్గురు పాకిస్తాన్ సైనికులు హతం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే కశ్మీర్లోని ఇండియా-పాకిస్తాన్ బోర్డర్‌లో మాత్రం కాల్పుల మోత మోగింది. రాజౌరి, ఉరీ సెక్టార్‌లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఐతే కాల్పులను ధీటుగా ఎదుర్కొన్న భారత సైనికులు.. పాక్ జవాన్లపై ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు పాకిస్తాన్ జవాన్లు హతమైనట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అంతేకాదు పలు పాక్ పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
కాగా, భారత సైన్యమే కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ జవాన్లు మరణించారన్న అక్కడి అధికారులు...భారత కాల్పులు తిప్పికొట్టామని తెలిపారు. పాకిస్తాన్ చేసిన ఎదురుదాడిలో ఐదుగురు భారత సైనికులు కూడా చనిపోయారని వెల్లడించారు. ఐతే పాకిస్తాన్ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. మన సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఎల్‌వోసీ వెంబడి కాల్పులతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు