3 NAXALS CRPF JAWAN KILLED IN JHARKHAND ENCOUNTER SB
ఎన్నికల వేళ ఝార్ఖండ్ అడవుల్లో కాల్పులు... ముగ్గురు మావోయిస్టులు హతం
ప్రతీకాత్మక చిత్రం
ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, 3 బులెట్ మ్యాగజైన్లు, 4 పైపు బాంబులను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు.
ఝార్ఖండ్‌లో కాల్పుల మోత మోగింది. గిరిదీహ్ అడవుల్లో మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఎన్కౌంటర్లో ముగిసింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్ జిల్లా బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్‌కు చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్‌ను హతమార్చారు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, 3 బులెట్ మ్యాగజైన్లు, 4 పైపు బాంబులను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో ముమ్మర గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 29 నుంచి ఝార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.