హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video : దేవుడు కలిపిన జంట!.. 3 అడుగుల ఎత్తున్న వధూవరుల పెళ్లి వైరల్

Video : దేవుడు కలిపిన జంట!.. 3 అడుగుల ఎత్తున్న వధూవరుల పెళ్లి వైరల్

దేవుడు కలిపిన జంట!

దేవుడు కలిపిన జంట!

Rajasthan Viral Marriage of 3 feet Couple : దేవుడే జంటలను కలుపుతాడని అంటారు. 3 అడుగుల ఎత్తన్న వధువు, 3 అడుగుల ఎత్తున్న వరుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

3 Feet Groom Married to 3 Feet Bride : ప్రతి ఒక్కరికి తమ పెళ్లి గురించి ఒక కల ఉంటుంది. పెళ్లీడు వచ్చాక.. వధువు లేదా వరుడితో వివాహం అవుతుంది. ఐతే.. వరుడు.. ఆరడుగుల ఎత్తు ఉండాలి.. సిక్స్ ప్యాక్ ఉండాలి అని అమ్మాయిలు... వధువు అతిలోక సుందరిలా ఉండాలి అని అబ్బాయిలూ కోరుకుంటే.. ఈ ప్రపంచంలో ఎంతమందికి పెళ్లిళ్లు అవుతాయి. పైకి కనిపించే అందం శాశ్వతం కాదు. మనసు మంచిదవ్వాలి కదా. ఈ పెళ్లి విషయంలో మాత్రం ఫిజికల్ అంశాలు కీలకం అయ్యాయి. ఎందుకంటే.. వధువు ఎత్తు 3 అడుగులే.. ఆమెకు వరుడు కూడా అదే హైట్‌లో కావాలి. రాజస్థాన్‌కి చెందిన 3 అడుగుల ఎత్తున్న వరుడికి... ఆ అమ్మాయి సెట్ అయ్యింది.

దేవుడే జంటలను ఒక్కటి చేస్తాడని పెద్దలు అంటుంటారు. 3 అడుగుల వధువు, 3 అడుగుల వరుడు యొక్క అద్భుతమైన వివాహ చిత్రాలను చూసినప్పుడు.. నిజమే దేవుడే వీళ్లను కలిపి ఉంటాడు అని అనిపించడం సహజం. ఈ ప్రత్యేకమైన జంట వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ జంట వీడియోని ఇక్కడ చూడండి :

' isDesktop="true" id="1602674" youtubeid="lxmTmwLOvTw" category="national">

3 అడుగుల వధువు, 3 అడుగుల వరుడు :

ఈ ఏడాది జనవరి 26న జోధ్‌పూర్‌లో ఈ అపూర్వ వివాహం జరిగింది. సాధారణ వివాహాల మాదిరిగానే వివాహం అంగరంగ వైభవంగా పూర్తయినప్పటికీ, దాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రాజ్‌సమంద్‌‌కు చెందిన 3 అడుగుల వరుడు రిషబ్ తన సమానమైన వధువు.. జోధ్‌పుర్‌కు చెందిన సాక్షి‌తో వేదికపై కనిపించాడు. ఇద్దరూ చదువుకున్నవారే. రిషబ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, వధువు ఎంబీఏ పూర్తి చేసింది. ఇద్దరూ వేదికపైకి రాగానే ప్రజలు చప్పట్లు, ఈలలతో స్వాగతం పలికి వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Telugu Memes : నవ్వించే మీమ్స్ .. టాలీవుడ్ గాసిప్స్

నిజానికి వీరిద్దరిదీ ప్రేమ వివాహం. సంవత్సరం కిందట స్నేహితులై.. తర్వాత ప్రేమికులయ్యారు. అప్పుడే పెద్దలు వీరికి నిశ్చితార్థం చేశారు. తాజాగా.. ఈ పెళ్లి ఫొటోలు చూసి అంతా వీరిని ఆశీర్వదిస్తున్నారు.

First published:

Tags: Rajasthan

ఉత్తమ కథలు