కాశ్మీర్ లో ఉగ్రదాడి...ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు దాడి చేసారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు

news18-telugu
Updated: April 19, 2020, 8:04 AM IST
కాశ్మీర్ లో ఉగ్రదాడి...ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
(ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)
  • Share this:
ప్రపంచం కరోనా భయం తో వణికి పోతుంటే ఉగ్రవాదులు మాత్రం ఇంకా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ వారంలోనే ఇది మూడవ ఉగ్రదాడి. కాగా తాజాగా ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు దాడి చేసారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్ 179వ బెటాలియన్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భద్రతాబలగాలు తిరిగి ఎదురుకాల్పులు జరిపేలోపే సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ వార్త తెలిసిన వారంతా ఈ ఉగ్రవాదులకు కరోనా వచ్చి పోతే బాగుండు అని అనుకుంటున్నారు.
Published by: Krishna Adithya
First published: April 19, 2020, 8:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading