మావోయిస్టుల ఘాతుకం.. IED బాంబుపేలి ముగ్గురు మృతి

పేలుడు ధాటికి డీజిల్ ట్యాంకర్ అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడింది. ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు.

news18-telugu
Updated: September 24, 2019, 2:44 PM IST
మావోయిస్టుల ఘాతుకం.. IED బాంబుపేలి ముగ్గురు మృతి
పేలుడు ధాటికి డీజిల్ ట్యాంకర్ అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడింది. ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు.
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కాంకేర్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో IED బాంబును పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోయారు. రావుఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాంకేర్ జిల్లాల్లో తుమపాల్-కోస్రాండ రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. అక్కడికి ఓ డీజిల్ ట్యాంకర్ వెళ్తుండగా మావోయిస్టులు కాపుగాసి దాడి చేశారు. పేలుడు ధాటికి డీజిల్ ట్యాంకర్ అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడింది. ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే కాంకేర్ జిల్లా పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మావోయిస్టుల దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు విశాఖ ఏజెన్సీ కూడా కాల్పుల మోతతో దద్ధరిల్లింది. రెండు రోజులుగా ఏవోబీలో భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదుగురు మావోయిస్టులను హతమార్చారు. భారీ మొత్తంలో ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దును జల్లెడపడుతున్నారు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...