వరద బాధితుల కోసం వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్

ఉత్తరకాశీ జిల్లా మోరీ నుంచి మోల్దీకి హెలికాప్టర్‌లో నిత్యావసరాలు తీసుకెళ్తున్నారు. ఐతే మార్గమధ్యలో కరెంట్ తీగలు తగలడంతో హెలికాప్టర్ కుప్పకూలింది.

news18-telugu
Updated: August 21, 2019, 2:46 PM IST
వరద బాధితుల కోసం వెళ్తూ  కుప్పకూలిన హెలికాప్టర్
కుప్పకూలిన హెలికాప్టర్
  • Share this:
ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువులు తీసుకెళ్తుండగా.. ఉత్తరకాశీ జిల్లాలోని ఆరాకోట్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో కొన్నిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచరియల ధాటికి మారుమూల ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. ఆయా ప్రాంతాల్లోని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉత్తరకాశీ జిల్లా మోరీ నుంచి మోల్దీకి హెలికాప్టర్‌లో నిత్యావసరాలు తీసుకెళ్తున్నారు. ఐతే మార్గమధ్యలో కరెంట్ తీగలు తగలడంతో హెలికాప్టర్ కుప్పకూలింది.

ప్రమాదంలో కెప్టెన్ లాల్, కోపైలట్ శైలేష్‌, రాజ్‌పాల్ అనే స్థానికుడు మరణించారు. సమాచారం అందిన వెంటనే ఇంటో టిబెటన్ బోర్డర్ పోలీస్ (itbp) బలగాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. వారు తక్షణమే స్పందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదిగా గుర్తించారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...