వచ్చే పది రోజుల్లో 2600 రైళ్లు...

వచ్చే పది రోజుల్లో 2600 రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది. దీని వల్ల సుమారు 36 లక్షల మంది ప్రయాణించవచ్చు.

news18-telugu
Updated: May 23, 2020, 6:16 PM IST
వచ్చే పది రోజుల్లో 2600 రైళ్లు...
గతవారం 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ బిడ్లను ఆహ్వానించింది. 2021లో ఈ బిడ్లను తెరవనున్నారు. 2023 ఏప్రిల్ నాటికి ఈ ప్రైవేటు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • Share this:
వచ్చే పది రోజుల్లో 2600 రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఈ ప్రకటన చేశారు. దీని వల్ల సుమారు 36 లక్షల మంది ప్రయాణించవచ్చని చెప్పారు. వినోద్ కుమార్‌తో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు, కేంద్ర సమాచార శాఖ అధికారులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే వినోద్ కుమార్ ఈ ప్రకటన చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో నిలిచిపోయిన వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు మే 1వ తేదీ నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతోంది. మే 20వ తేదీ వరకు 279 రైళ్లు నడిచాయని, 4 లక్షల మంది కూలీలను గమ్యస్థానాలకు చేర్చినట్టు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల మంది ప్రయాణించారన్నారు. వలస కూలీలను సొంతూళ్లకు చేర్చడంతో పాటు నిత్యావసర సరుకులను కూడా రవాణా చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిత్యావసర సరుకులు తరలించేందుకు రైల్వే 24 గంటలూ శ్రమిస్తోందన్నారు. దేశంలోని ఏ స్టేషన్ నుంచి అయినా సర్వీసులు అందించేందుకు రైల్వే సిద్ధంగా ఉందని వినోద్ కుమార్ ప్రకటించారు. మరోవైపు కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం 5000 కోచ్‌లను కంటైన్మెంట్ సెంటర్లుగా మార్చామని, 80వేల బెడ్లు అందుబాటులో తెచ్చామన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 23, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading