మరో మూక దాడి : గోవులను అక్రమంగా తరలిస్తున్నారని..

ఆవుల అక్రమ రవాణా ఆరోపణలతో మరో దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని 25మందిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: July 8, 2019, 12:54 PM IST
మరో మూక దాడి : గోవులను అక్రమంగా తరలిస్తున్నారని..
గోవులను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తుల దాడి..
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో గోవులను అక్రమ తరలిస్తున్నారని ఆరోపిస్తూ 25 మందిపై గోరక్షక సభ్యులు దాడి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి.. గుంజీలు తీయిస్తూ.. 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేయించారు. అనంతరం దాదాపు 100 మంది గ్రామస్తులు 2కి.మీ దూరంలోని పోలీస్ స్టేషన్ వరకు వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ తతంగం మొత్తాన్నిపలువురు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.గోఅక్రమ రవాణా పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.

సరైన అనుమతులు లేకుండా గోవులను అక్రమంగా తరలిస్తున్న కొంతమందిని అరెస్ట్ చేశాం.అలాగే వారిపై దాడి చేసిన గ్రామస్తులపై కూడా కేసు నమోదు చేశాం. నిందితులకు చెందిన 21 ట్రక్కులను సీజ్ చేశాం. గోవులను గో ఆశ్రమానికి తరలించాం. వాటిని మధ్యప్రదేశ్‌లోని హర్దా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు.
హరిశంకర్,స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్


First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు