• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • 25 MEN ON BIKES RAIN BULLETS INDISCRIMINATELY IN MADHYA PRADESH MORENA WATCH VIDEO SU

Viral Video: తుపాకులతో హల్‌చల్‌.. బైక్స్‌పై తిరుగుతూ కాల్పులు..

Viral Video: తుపాకులతో హల్‌చల్‌.. బైక్స్‌పై తిరుగుతూ కాల్పులు..

(Image-Twitter)

ఆకతాయిలు వీరంగం సృష్టించారు. దాదాపు 25 మంది తుపాకులు పట్టుకుని బైక్స్ మీద తిరుగుతూ భీభత్సం సృష్టించారు.

  • Share this:
    ఆకతాయిలు వీరంగం సృష్టించారు. దాదాపు 25 మంది తుపాకులు పట్టుకుని బైక్స్ మీద తిరుగుతూ భీభత్సం సృష్టించారు. 100 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. 25 మంది శనివారం పట్టపగలు రోడ్ల మీద తిరుగుతూ తీవ్ర అలజడి సృష్టించారు. తుపాకులు చేత బట్టి ప్రజలను భయాందోళకు గురిచేశారు. ఈ ఘటనలో ఆస్పత్రికి వెళ్లే ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. పలు బస్సులు, ఇళ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్‌ ఎస్పీ రాయ్‌ సింగ్‌ నార్వారియా పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప‍్పారు.

    ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతిపై ఫేస్‌ బుక్‌లో పెట్టిన పోస్ట్‌ వల్ల రెండు సామాజిక వర్గాల మధ్య అగ‍్గిరాజేసిందని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం బైకర్స్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిపై వేరే వర్గం వారు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. నిందితుడిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.





    మొత్తం ఈ ఘటనలో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. 9 మందిని అదుపులోకి తీసుకున్నామని అడిషనల్‌ ఎస్పీ రాయ్‌ సింగ్‌ నార్వారియా తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మే 15 వరకు లాక్‌డౌన్ విధించారు. ఇక, బైకర్ గ్యాంగ్ ఇతర నిబంధనలతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినట్టైంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు