హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉన్న ఫలంగా 22 స్కూళ్లు మూసేయాలంటూ ఆర్డర్.. ఎక్కడంటే..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉన్న ఫలంగా 22 స్కూళ్లు మూసేయాలంటూ ఆర్డర్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: కొన్ని రోజులుగా బెళగావి ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుంది. ఇప్పటికే పులి అనేక మందిని తీవ్రంగా గాయపర్చింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

కొన్నిసార్లు అడవిలోని పులులు, చిరుత పులులు, ఎలుగు బంట్ల వంటి క్రూర జంతువులు దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి. మరికొన్నిసార్లు.. ఆహార అన్వేషణ, నీళ్ల కోసం కూడా కోసం అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోకి వస్తుంటాయి. అలాంటి సమయంలో అవి మనుషులపైకి దాడికి దిగుతుంటాయి. కొన్నిసార్లు.. మనుషులు కూడా క్రూర జంతువులను చంపుతుంటారు. కొంత మంది మాత్రం క్రూర జంతువులు కన్పిస్తే.. అడవి అధికారులకు సమాచారం ఇస్తారు. ఫారెస్టు అధికారులు జంతువులను చాకచక్యంగా పట్టుకుని, తిరిగి అడవుల్లోకి లేదా జూల్లోకి వదిలేస్తారు. అయితే.. ఒక చిరుతపులి జనావాసాల్లోకి ప్రవేశించి, అందరిని భయ భ్రాంతులకు గురిచేస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (karnataka) బెళగావి ప్రాంతంలో అనుకొని ఘటన జరిగింది. అక్కడ కొన్నిరోజులుగా చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఇప్పటికే అది పలువురిని గాయపర్చింది. ఈ క్రమంలో అక్కడి అధికారులు మూడు రోజులుగా స్కూళ్లను మూసివేయాలని ఆదేశించారు. పులిని పట్టుకొవడానికి ప్రత్యేక సిబ్బందిని రంగంలోనికి దింపారు. అనేక చోట్ల ప్రత్యేక బోనులను ఏర్పాడు చేశాడు. అయిన కూడా చిరుతపులి చిక్కినట్లే చిక్కి మళ్లి మాయమైపోతుంది. దీంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు.ఈ క్రమంలో.. బెళగావి ప్రాంతంలోని 22 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఉన్నఫళంగా మూసేయాలని, తిరిగి తాము చెప్పేవరకు స్కూళ్లను తెరవద్దని జిల్లాయంత్రాంగం స్పష్టం చేసింది. అక్కడ అనేక ప్రాంతాలలో సీసీ కెమెరాలు, ఎనిమిది బోనులు, ముధోల్ కుక్కలను కూడా రప్పించారు. అదే విధంగా ఏనుగుల మీద సంచరిస్తూ.. వాటిని చూడటానికి గజరాజులను కూడా రప్పించారు. ఈ ఆపరేషన్ కోసం.. 120 మంది అటవీ అధికారులు, 80 మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొందరలోనే చిరుతపులిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.


ఇదిలా ఉండగా ఒక కలెక్టర్ తన కళ్లముందే లంచం ఇస్తుండగా చూస్తు ఉండిపోయాడు.


పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  కోతులు నానా రచ్చ చేశాయి. మథురలోని బృందావన్‌ శ్రీకృష్ణుడి ఆలయం సమీపంలో ప్రతిరోజు కోతులు భక్తులను తెగ ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. దర్శనానికి వచ్చిన వారి చేతులనుంచి ప్రసాదాలు, ఆలయానికి తీసుకెళ్లే పదార్థాలను లాక్కెళ్తుంటాయి. అయితే.. ఇప్పటికే స్థానిక ప్రజలు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న సమస్యలను తనిఖీ చేయడానికి బృందావన్‌ కలెక్టర్ నవనీత్ చాహల్ వచ్చారు. అప్పుడు ఆయన అక్కడున్న అధికారులతో మాట్లాడుతున్నారు.


తన కళ్లద్దాలను వాహనంపైన ఉంచారు. ఇంతలో కోతులు అక్కడికి వచ్చి.. కళ్లద్దాలను పట్టుకుని వెళ్లిపోయాయి. దీంతో కలెక్టర్ షాకింగ్ కు గురయ్యారు. వెంటనే దాన్ని పట్టుకొవడానికి అక్కడున్న అధికారులు కోతులను వెంబడించారు. కొన్ని గంటలపాటు వేచి చూసిన తర్వాత.. కోతులకి కొన్ని పళ్లు తినడానికి ఇస్తే.. అవి కళ్లద్దాలను అక్కడే వదిలేశాయి. దీంతో అధికారులు హమ్మాయ్య... అంటూ ఊపిరి పీల్చుకున్నారు.Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు