• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • 22 MIGRANT WORKERS FLEEING QUARANTINE CENTERS IN CHHATTISGARH BN

క్వారంటైన్ కేంద్రం నుంచి 22 మంది వలస కార్మికులు పరార్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దాదాపు 47 మంది వలస కార్మికులు గురువారం ఛత్తీస్‌గడ్‌కు వచ్చారని తెలిపారు. అధికారులు లేని సమయంలో ఆ కేంద్రాల నుంచి 20 మందికి పైగా వలస కార్మికులు తప్పించుకుపోయారు.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అంతటితో ఆగకుండా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా వైరస్ అనుమానిత లక్షణలు ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించి.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు ఇటీవల వలస కార్మికులు చేరుకున్నారు. వారందరినీ దంతూవాడ జిల్లాలోని బస్రత్ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అయితే ఏమైందో ఏమోగానీ అధికారులు లేని సమయంలో ఆ కేంద్రాల నుంచి 20 మందికి పైగా వలస కార్మికులు తప్పించుకుపోయారు. దీనిపై దంతేవాడ జిల్లా కలెక్టర్ తోపేశ్వర్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దాదాపు 47 మంది వలస కార్మికులు గురువారం ఛత్తీస్‌గడ్‌కు వచ్చారని తెలిపారు. వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో క్వారంటైన్ చేశాం. వారిలో 22 మంది తప్పించుకుని పారిపోయారు. కాగా, పారిపోయిన వారిలో ఎవరికీ కరోనా అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు. పారిపోయిన వారంత నహాది గ్రామానికి చెందినవారని, వారి గ్రామ సర్పంచ్, కార్యదర్శికి సమాచారం ఇచ్చామని కలెక్టర్ చెప్పుకొచ్చారు.
    Published by:Narsimha Badhini
    First published: