హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: పొటేత్తిన భారీ వరద.. 22 మంది దుర్మరణం.. మరో 5 గురు చూస్తుండగానే..

OMG: పొటేత్తిన భారీ వరద.. 22 మంది దుర్మరణం.. మరో 5 గురు చూస్తుండగానే..

భారీగా పొటెత్తిన వరద

భారీగా పొటెత్తిన వరద

Flash Floods: హిమాచల్ ప్రదేశ్ లోని కొండ చరియలు విరిగిపడ్డాయి. సడెన్ గా భారీ వరద వచ్చింది. ఈక్రమంలో స్థానికంగా ఉన్న బ్రిడ్జ్ సైతం నామారూపాల్లేకుండా కొట్టుకుపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Himachal Pradesh, India

కొన్నిరోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో (Himachal pradesh) భారీ వర్షపాతం సంభవిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మండి, కాంగ్రా, చంబా జిల్లాలలో అత్యధికంగా వరద సంభవించింది. దీని వలన కొండ చరియలు విరిగిపడ్డాయి. అంతే కాకుండా.. 22 మంది చనిపోయారు. మరో 5 గురు గల్లంతయ్యారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటలుగా కుండపోతగా వర్షం కురుస్తోంది.

భారీ వర్షాల (Heavy rain) కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదలు, సంభవించడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులతో సహా కనీసం 22 మంది మృతి చెందారని, మరో ఐదుగురు అదృశ్యమయ్యారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుదేష్ తెలిపారు. కుమార్ మొఖ్తా శనివారం తెలిపారు. మండి, కాంగ్రా, చంబా జిల్లాల్లో గరిష్ట నష్టం నమోదైందని, రాష్ట్రంలో ఇప్పటివరకు 36 వాతావరణ సంబంధిత సంఘటనలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. అదే విధంగా.. మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి మరియు షోఘి వద్ద సిమ్లా-చండీగత్ హైవే సహా 743 రోడ్లు ట్రాఫిక్ కోసం బ్లాక్ చేయబడ్డాయి.

ఒక్క మండిలోనే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. గోహర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కషన్ గ్రామంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) మరియు పోలీసులు నాలుగు గంటలపాటు జరిపిన శోధన ఆపరేషన్ తర్వాత ఒక కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యుల మృతదేహాలను వారి ఇంటి శిధిలాల నుండి వెలికి తీశారని ఆయన తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిపోయింది. ప్రస్తుతం అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా గర్బవతి పట్ల కొంత మంది దారుణానికి ఒడిగట్టారు.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) షాకింగ్ ఘటన జరిగింది. బరేలీ జిల్లాకు చెందిన మహిళ గత మంగళవారం.. సహారాన్ పూర్ కు వెళ్లడానికి ఇంటి నుంచి బైటకు వచ్చింది. ఈ క్రమంలో.. ఆమెను ఫరూఖాబాద్ లోని బస్ టెర్మినల్ వద్ద కొందరు మాటలు కలిపారు. ఆ తర్వాత.. ఆమెను మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మూడు వారాల పాటు ఆమెను బలవంతంగా అత్యాచారం చేశారు.

ఈ క్రమంలో నిందితులు పడుకొని ఉండగా మహిళ మెల్లగా అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. అక్కడ ఉన్న గ్రామస్థులకు తన బాధను చెప్పుకుంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.మూడు రోజులుగా కనీసం ఎలాంటి ఆహారం ఇవ్వలేదని, తనపై బలవంతంగా పశువాంఛను తీర్చుకున్నారని మహిళ కన్నీరు పెట్టుకుంది. అంతే కాకుండా, చంపుతామని పలుమార్లు బెదిరించారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Heavy Rains, Himachal Pradesh

ఉత్తమ కథలు