ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ 21 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. అపస్మారకస్థితిలో దేహమంతా కాలిపోయిన రీతిలో నగ్నంగా రోడ్డుపక్కన పడిపోయి ఆ యువతి కనిపించింది. రోడ్డుపై వెళ్లేవాళ్లు ఆమె గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్తా ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజన్ పూరర్ పరిధిలో స్వామి సుఖ్ దేవానంద్ కాలేజీలో 21 ఏళ్ల యువతి బీఏ సెకండియర్ చదువుతోంది. నగరంలోని కాంత్ ప్రాంత పరిధిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. సోమవారం ఉదయం తన స్నేహితులు ఫోన్ చేశారనీ, కాలేజీలో దింపమని తండ్రిని కోరింది. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కూతురిని ఆ తండ్రి కాలేజీ గేటు వద్ద దింపాడు.
కొద్ది సేపట్లో తిరిగి వస్తానని వెళ్లేటప్పడు చెప్పింది. కానీ ఆమె ఎంతకూ తిరిగి రాలేదు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో కాలేజీ లోపలికి వెళ్లి ఆమె కోసం ఆ తండ్రి వెతికాడు. కానీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాలేజీ బయట, చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ, బంధువుల వద్ద కూడా తన కూతురి గురించి ఆ తండ్రి ఆరా తీశాడు. రాత్రి ఏడు గంటల సమయంలో ఆ తండ్రికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ’మీ కూతురిపై హత్యాయత్నం జరిగింది. ఆమెను ఎవరో మంటల్లో కాల్చేశారు. నగారియా ప్రాంతంలో రోడ్డు పక్కన సగానికి పైగా కాలిపోయిన స్థితిలో అపస్మాకర స్థితిలో పడి ఉంది. మేము ఆసుపత్రికి తీసుకు వచ్చాం.‘ అంటూ ఆ తండ్రికి ఓ బాంబులాంటి వార్తను పోలీసులు చెప్పారు. దీంతో హుటాహుటిన ఆ తండ్రి ఆసుపత్రికి వెళ్లాడు.
ఇది కూడా చదవండి: మద్యం మత్తులో భర్త.. చీరతో ఉరి బిగించి చంపిన భార్య.. ఏమీ తెలియనట్లు శవాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి..
కాగా ఈ ఘటనపై బాలిక కాస్త కోలుకున్న తర్వాత మాట్లాడింది. ’నాకు ఏమీ గుర్తులేదు. కాలేజీలో మూడో ఫ్లోర్ కు వెళ్లడం మాత్రమే గుర్తుకు ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు.‘ అని చెప్పింది. దాదాపు 60శాతంపైగా దేహం కాలిపోయిందనీ, పరిస్థితి విషమంగానే ఉందనీ, ఆ యువతిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ’నా కూతురు ఒంటరిగా ఇంటి నుంచి ఎక్కువగా బయటకు వెళ్లేది కాదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కూడా కాదు. అసలు ఏం జరిగిందో తెలియాలి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. నా కూతురికి న్యాయం జరగాలి. దోషులకు శిక్ష పడాలి‘ అంటూ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఆ యువతి చదువుతున్న కాలేజీ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ది కావడం, ఆయనే స్వయంగా ఆ కాలేజీకి చైర్మన్ హోదాలో ఉండటంతో ఈ ఘటన రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రేయసితో భర్త ఎస్కేప్.. ఎక్కడున్నారో తెలిసి వెళ్లిన భార్య.. వారితోనే ఉండేందుకు డీల్.. చివరకు కథ అడ్డం తిరిగింది..!
Published by:Hasaan Kandula
First published:February 23, 2021, 13:40 IST