21 VILLAGERS DIED WITH CORONA WHO ATTENDED FUNERAL IN RAJASTHAN VRY
corona effect : అంత్యక్రియలకు వెళ్లిన 21 మంది మృతి..కరోనా..మరణాలా ?
ప్రతీకాత్మక చిత్రం
corona : కరోనా మహమ్మారి చనిపోయిన శావాలకు కూడ తృప్తిగా అంత్యక్రియలు నిర్వహించనీయడం లేదు..కరోనాతో చనిపోయిన వారి వద్దకు వెళ్లినా.. కరోనా కబలిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలకు హజరైన 21 మందికి కరోనా సోకి దాని దాటికి బలయ్యారు.
కరోనా మహమ్మారి చనిపోయిన శావాలకు కూడ తృప్తిగా అంత్యక్రియలు నిర్వహించనీయడం లేదు..కరోనాతో చనిపోయిన వారి వద్దకు వెళ్లినా.. కరోనా కబలిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలకు హజరైన 21 మందికి కరోనా సోకి దాని దాటికి బలయ్యారు.
దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అంత్యక్రియలకు కేవలం ఇరవై మందినే అనుమతిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ..కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరి అంత్యక్రియలు వెళ్లిన 21 మందిని కరోనా కబలించింది. ఒక్కరి కోసం వెళితే 21 మంది ప్రాణం తీసుకున్న సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.దీంతో సంచలనంగా మారింది. కాని అధికారులు మాత్రం కేవలం ఆరుగురు మాత్రమే అంత్యక్రియలకు వెళ్లినవారు మృత్యువాత పడ్డారని చెబుతున్నారు
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో గత నెల 21న కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని స్వగ్రామమైన ఖీర్వా గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అయితే అంతిమ యాత్రలో నిబంధలకు విరుద్దంగా సుమారు 150 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. ఇక అంత్యక్రియలు ముగిసిన తర్వాత నుండి ఈ నెల 5వ తేదీ మధ్య ఏకంగా 21 మంది గ్రామస్థులు కరోనాతో మృతి చెందినట్టు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం చనిపోయిన వారందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నవారే కావడంతో స్తానికంగా ఆందోళన నెలకొంది అయితే, అధికారులు మాత్రం అందులో నాలుగు మరణాలు మాత్రమే కొవిడ్ సంబంధమైనవని, మిగతావి వయసు పరమైన సమైస్యల కారణంగా సంభవించిన మరణాలని పేర్కొన్నారు. అవి కరోనా మరణాలు అవునో, కాదో తెలుసుకునేందుకు ఆయా కుటుంబాలకు చెందిన 147 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు లక్ష్మణ్‌గఢ్ సబ్ డివిజనల్ అధికారి కల్రాజ్ మీనా తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన గోవింద్ డోటస్రా వెలుగులోకి తీసుకువచ్చాడు.