హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Republic Day 2022: ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణగా పంజాబ్ వాహనం.. వాయుసేన విన్యాసాలు

Republic Day 2022: ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణగా పంజాబ్ వాహనం.. వాయుసేన విన్యాసాలు

రిపబ్లిక్ డే పరేడ్

రిపబ్లిక్ డే పరేడ్

భారత 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ లో గణతంత్ర పరేడ్ ఆద్యంతం కన్నులపడువగా సాగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన భారత్ లో వైవిద్యానికి అద్దంపట్టేలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

భారత 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ లో గణతంత్ర పరేడ్ ఆద్యంతం కన్నులపడువగా సాగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన భారత్ లో వైవిద్యానికి అద్దంపట్టేలా ఉన్నాయి. దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు చేశాయి. వివిధ కమెరాల్లో షూట్ చేసిన పరేడ్ దృశ్యాలను రాజ్‌పథ్‌ మార్గంలో ఉంచి ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు.

ఈ యేడాది నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు.

ఇక జలియన్‌వాలా బాఘ్ నిందితుడు జనరల్ డయ్యర్‌ను సద్ధామ్ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్లి కాల్చి చంపిన ఘటనను కూడా ప్రస్తావించారు. త్రివిధ దళాలతో పాటు వివిధర రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖల శకటాల్లో స్వాతంత్ర్య పోరాటం నాటి ఆనవాళ్లు కనిపించినప్పటికీ పంజాబ్‌ శకటమే అమితంగా ఆకర్షించిందని నెటిజెన్లు అంటున్నారు.

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.

ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.రాజ్ పథ్ లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.

1971 యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన సెంచూరియన్ ట్యాంక్, PT-76 ట్యాంక్‌ను భారత సైన్యం ప్రదర్శించింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి.

రిపబ్లిక్‌ డే కవాతులో మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాలు విన్యాసాలు చేశాయి. ఇందులో పాత విమానాలతో పాటు ఆధునిక ఫైటర్‌ జెట్‌లు అయిన రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్‌ వంటివి ప్రదర్శించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Indian Air Force, Republic Day 2022

ఉత్తమ కథలు