అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్‌కు పద్మ విభూషణ్... మొత్తం 141 మందికి పద్మ పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సారి జాబితాలో చోటు దక్కించుకున్నారు.

news18-telugu
Updated: January 25, 2020, 9:49 PM IST
అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్‌కు పద్మ విభూషణ్... మొత్తం 141 మందికి పద్మ పురస్కారాలు
ప్రతీకాత్మక చిత్రం
 • Share this:
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2020 సంవత్సరానికి సంబంధించి మొత్తం 141 మందిని పద్మ పురస్కారానికి ఎంపిక చేసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సారి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మంది పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు ఉన్నారు. 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు. 12 మంది చనిపోయిన తర్వాత పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి. వారిలో పీవీ సింధుకు పద్మ భూషణ్ (తెలంగాణ నుంచి), చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం - తెలంగాణ), విజయసారధి శ్రీభాష్యం (తెలంగాణ - విద్యారంగం), యడ్ల గోపాల్ రావు (కళలు, ఆంధ్రప్రదేశ్), దాలవాయి చలపతిరావు (కళలు, ఆంధ్రప్రదేశ్) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.

పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు

పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికైనవారు

 • ముంతాజ్ అలీ

 • సయ్యద్ మౌజీమ్ అలీ (మరణానంతరం)

 • ముజఫర్ హుసేన్ బేగ్

 • అజయ్ చక్రవర్తి

 • మనోజ్ దాస్

 • బాలకృష్ణ దోషి

 • కృష్ణమ్మాల్ జగన్నాథన్

 • ఎస్‌సీ జామిర్

 • అనిల్ ప్రకాష్ జోషి

 • సెరింగ్ లాందోల్

 • ఆనంద్ మహీంద్రా (వ్యాపారవేత్త)

 • నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం)

 • మనోహర్ పారికర్ (మరణానంతరం)

 • జగదీష్ సేథ్ (అమెరికా)

 • పీవీ సింధు (తెలంగాణ)

 • వేణు శ్రీనివాసన్


పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖులు

 • ఏక్తా కపూర్ (సినీ పరిశ్రమ)

 • కంగనా రనౌత్ (సినీ పరిశ్రమ)

 • అద్నన్ సామి (సినీ పరిశ్రమ)

 • కరణ్ జోహార్ (సినీ పరిశ్రమ)


 

 

 
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు