హోమ్ /వార్తలు /జాతీయం /

జవాన్ల త్యాగాలపై రాజకీయమా ? ప్రధాని తీరును తప్పుబట్టిన విపక్షాలు

జవాన్ల త్యాగాలపై రాజకీయమా ? ప్రధాని తీరును తప్పుబట్టిన విపక్షాలు

21 విపక్ష పార్టీల సమావేశం అనంతరం మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

21 విపక్ష పార్టీల సమావేశం అనంతరం మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన విపక్షాలు... వైమానిక దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు అభినందనీయమని ప్రశంసించాయి. అయితే భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్దికి వాడుకోవడాన్ని విపక్షాలు ఖండించాయి.

    పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులను విపక్షాలు అభినందించాయి. పార్లమెంట్ లైబ్రరీ హాలులో సమావేశమైన 21 రాజకీయ పార్టీలు... దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించాయి. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన విపక్షాలు... వైమానిక దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు అభినందనీయమని ప్రశంసించాయి. అయితే భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్దికి వాడుకోవడాన్ని విపక్షాలు ఖండించాయి. సంకుచిత రాజకీయాల కోసం జాతిభద్రతను పణంగా పెట్టకూడదని ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని విపక్షాలు ఆరోపించాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, ఆజాద్ హాజరుకాగా... టీడీపీ అధినేత చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ, శరద్ పవార్, శరద్ యాదవ్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు.

    First published:

    Tags: Congress, India VS Pakistan, Pm modi, Pulwama Terror Attack, Surgicalstrike2, Tdp

    ఉత్తమ కథలు