బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?

Lok Sabha Election 2019 : దేశ రాజకీయాల్లో సరికొత్త ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో అస్త్రం సంధించేందుకు 21 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అది సక్సెస్ అయితే, బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అనే సంకేతాలొస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 10:14 AM IST
బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?
నరేంద్రమోదీ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 10:14 AM IST
లోక్ సభ ఎన్నికలు పూర్తవడానికి ఇంకా రెండు దశలో మిగిలివున్నాయి. ఆ తర్వాతేముంది... ఫలితాలు ప్రకటించడం, కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడమే. అది ఎన్డీయే కూటమి కావచ్చు, యూపీఏ కూటమి కావచ్చు... మరేదైనా కావచ్చు. బట్... ఒకవేళ ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే... దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కొత్త ఎత్తుగడ వేశాయి. ఎన్నికల ఫలితాలు రాగానే రాష్ట్రపతిని కలవాలనుకుంటున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకీ పూర్తి స్థాయి అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ ఇవ్వకపోతే... ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని కోరే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ మిత్రపక్షాల మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఐతే... ఇలా ఎక్కువ స్థానాలున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని పిలవవద్దని విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కోరబోతున్నట్లు తెలిసింది.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న 21 పార్టీలు... తమ సంతకాలతో ఓ లేఖ సిద్ధం చేశాయి. ఎన్నికల ఫలితాలు రాగానే... బీజేపీయేతర ప్రభుత్వానికే తమ మద్దతు ఇస్తున్నట్లుగా ఉన్న లేఖలను రాష్ట్రపతికి చూపించబోతున్నాయి. దీని వల్ల రాష్ట్రపతి... ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని కోరే అవకాశం ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది ఎన్నికైన సభ్యులుంటున్నారు. అందువల్ల మేజిక్ మార్కు 272గా ఉంది. 2014లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలిచి... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ... మిత్రపక్షాలతో కలిసి... 336 స్థానాలతో NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు... బీజేపీ గెలుచుకున్నది 178 స్థానాలు మాత్రమే. సంకీర్ణ కూటమిలో మిత్ర పక్షాలతో కలిపి 252 స్థానాలొచ్చాయి. బయటి నుంచీ కొన్ని పార్టీలు మద్దతివ్వడంతో.. ప్రభుత్వం ఏర్పాటైనా... 20 నెలల తర్వాత అది కుప్పకూలింది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది.

గత ఐదేళ్లలో మణిపూర్, గోవా, కర్ణాటకలో ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకున్న పార్టీలూ లేదా ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయ్. కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కినా, ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడం ద్వారా... బలనిరూపణలో బీజేపీ ఫెయిలై... కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే విధంగా... కేంద్రంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినా... 21 పార్టీలు ఒక్కటిగా ఉండి... తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనే అలోచనలో ఉన్నాయి. ఐతే... ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ కూటములతోపాటూ... బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటోంది. మరి ఆ కూటమి ఎలాంటి చక్రం తిప్పుతుందన్నది కూడా 21 పార్టీల కూటమిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.



మే 19న చివరి దశ ఎన్నికలు జరగనుండగా... మే 23న ఫలితాలు రానున్నాయి.

 

ఇవి కూడా చదవండి :
Loading...
3 నెలల్లో 17 మంది ఖైదీల విడుదల... కిమ్ కర్దాషియన్ చెబితే ట్రంప్ వినాల్సిందేనా...

యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...