2013 PATNA GANDHI MAIDAN SERIAL BLASTS NIA COURT PATNA PRONOUNCES QUANTUM OF PUNISHMENT FOR 9 CONVICTS 4 GET CAPITAL PUNISHMENT SK
2013 Patna Blasts case: మోదీ సభ వద్ద బాంబు పేలుళ్ల కేసు.. నలుగురికి ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
Patna bomb blasts case: నరేంద్ర మోదీ పాటు పలువురు ముఖ్యమైన నేతలు వేదికపై ఉన్న సమయంలోనే గ్రౌండ్లో బాంబు పేలుడు జరిగింది. అంతకు కొన్ని నిమిషాల ముందు పాట్నా జంక్షన్ వద్ద కూడా బాంబు పేలింది. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మరణించారు. మరో 89 మంది గాయపడ్డారు.
Patna bomb blasts case: నరేంద్ర మోదీ పాటు పలువురు ముఖ్యమైన నేతలు వేదికపై ఉన్న సమయంలోనే గ్రౌండ్లో బాంబు పేలుడు జరిగింది. అంతకు కొన్ని నిమిషాల ముందు పాట్నా జంక్షన్ వద్ద కూడా బాంబు పేలింది. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మరణించారు. మరో 89 మంది గాయపడ్డారు.
2013 పాట్నాబాంబు పేలుళ్ల కేసు(Patna Bomb Blast Case)లో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం (NIA Special Court)సంచలన తీర్పులు వెలువరించింది. ఈ కేసులో 9 మంది ఉగ్రవాదులను ఇప్పటికే దోషుగా ప్రకటించిన కోర్టు.. ఇవాళ వారికి శిక్షలను ఖరారు చేసింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష (Capital Punishment) విధిచింది. మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్పెషల్ కోర్టు జడ్జి గుర్విందర్ సింగ్ మల్హోత్ర ఈ తీర్పు ప్రకటించారు. బాంబు పేలుళ్లు జరిగిన 8 ఏళ్ల తర్వాత .. ఈ కేసులో దోషులకు శిక్ష ఖరారయింది.
హైదర్ అలీ, నోమన్ అన్సారీ, ముజిబిల్లా అన్సారీ, ఇంతియాజ్ ఆలమ్‌కు ఉరిశిక్ష పడగా..ఉమర్ సిద్దిఖీ, అజారుద్దీన్ ఖురేషీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇక అహ్మద్ హుస్సేన్, ఫిరోజో అస్లామ్‌కు 10 ఏళ్ల చొప్పున, ఇఫ్తిఖార్ ఆలమ్‌కు ఏడేళ్లు జైలు జీవితం అనుభవించబోతున్నారు. అక్టోబరు 27న మొత్తం 10 నిందితుల్లో తొమ్మిదిని దోషులుగా ధృవీకరించింది ఎన్ఐఏ కోర్టు. ఫక్రుద్దీన్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు లేకపోవడంతో నిర్దోషిగా ప్రకటించింది.
2013 Patna Gandhi Maidan serial blasts | NIA Court Patna pronounces quantum of punishment for 9 convicts-4 get capital punishment, 2 get life imprisonment, 2 get 10-yr imprisonment&one gets 7-yr imprisonment
Blasts had occurred at venue of then PM candidate Narendra Modi’s rally
కాగా, ఎనిమిదేళ్ల క్రిత బిహార్ (Bihar) రాజధాని పాట్నాలో ఉన్న గాంధీ మైదాన్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. అక్టోబరు 27, 2013న బీజేపీ నేతృత్వంలో హుంకార్ సభ (Hunkar Rally) జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరేంద్ర మోదీ పాటు పలువురు ముఖ్యమైన నేతలు వేదికపై ఉన్న సమయంలోనే గ్రౌండ్లో బాంబు పేలుడు జరిగింది. అంతకు కొన్ని నిమిషాల ముందు పాట్నా జంక్షన్ (Patna Junction) వద్ద కూడా బాంబు పేలింది. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మరణించారు. మరో 89 మంది గాయపడ్డారు. సిమి ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఐతే బాంబు పేలుడు కంటే.. ఎక్కువ మంది తొక్కిసలాటలోనే మరణించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ.. నరేంద్ర మోదీ అక్కడి నుంచి వెళ్లిపోలేదు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇలాంటి వాటికి భయపడబోమని స్పష్టం చేశారు.
మరుసటి రోజే ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఏడాదికి ఎన్ఐఏ చార్జీషీటు దాఖలు చేసి.. మొత్తం 11 మందిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో 8 ఏళ్ల పాటు విచారణ జరిగింది. నిందితుల్లో ఒకరైన తారిఖ్ అన్సారీ బాంబు పేలుళ్ల రోజే మరణించగా.. ఫఖ్రుద్దీన్ నిర్దోషిగా బయటపడ్డారు. మిగిలిన 9 మందిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా ప్రకటించింది. ఇవాళ శిక్షలు ఖరారు చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.