#BREAKING -- The court dismisses the petition. Hanging tomorrow at 5:30 AM.#JusticeForNirbhaya pic.twitter.com/NWoPipvsb2
— News18 (@CNNnews18) March 19, 2020
అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్‌పై వాడీవేడీ వాదనలు జరిగాయి. పిటిషన్ సమర్పించిన పత్రాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పిటిషన్‌లో అనెక్జర్, అఫిడవిట్, మెమోలు లేవని అసహనం వ్యక్తం చేసింది. ఐతే కరోనా వైరస్ ప్రభావంతో కోర్టులో జిరాక్స్ యంత్రాలు కూడా పనిచేయడం లేదని.. అందుకే తేలేకపోయామని దోషుల లాయర్ ఏపీ సింగ్ చెప్పారు. ఇవాళ మీరు కోర్టులు తిరిగారని.. ఫొటో కాపీ మెషీన్లు లేవంటూ కహానీలు చెప్పొదని జడ్జి అన్నారు. దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయని.. NHRCలో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు దోషులను ఎలా ఉరితీస్తారని ఏపీ సింగ్ కోర్టును ప్రశ్నించాడు. ఐతే మీ వాదనలు మాకు అర్ధం కావడం లేదని.. కేవలం లీగల్ పాయింట్స్ మాట్లాడితే చాలాని స్పష్టం చేసింది కోర్టు. సమయం గడిచిపోతోందని.. త్వరగా ముగించాలని ఒత్తిడి తెచ్చింది. మీ క్లయింట్‌లు దేవుడి దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందని జడ్జి అన్నారు. ఇంపార్టెంట్ పాయింట్‌ను లేవనెత్తకపోతే మీకు ఈ సమయంలో సాయం చేయలేదని ఖరాకండిగా చెప్పేసింది కోర్టు. వ్యవస్థతో ఎవరో ఆడుకుంటున్నారని.. రెండున్నరేళ్లు ఆలస్యంగా క్షమాభిక్ష పిటిషన్ వేయడం వెనక కుట్ర దాగున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఐతే దోషుల తరపు లాయర్ మాత్రం.. న్యాయాన్ని చంపేస్తున్నారని కామెంట్ చేశారు తప్ప.. వాలిడ్ పాయింట్ మాత్రం చెప్పలేదు. దాంతో ఆ పిటిషన్‌ను కొట్టివేశారు హైకోర్టు జడ్జి.
డెత్ వారెంట్‌ను రద్దు చేయాలన్న దోషుల తరఫు పిటిషన్‌ను గురువారం ఉదయం పాటియాలా కోర్టు కొట్టివేసింది. దీంతో దోషుల తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. పలు న్యాయ పత్రాలు ఇంకా కొన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను నిలిపివేయాలని వారు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై రాత్రి 10 గంటల సమయంలో అత్యవసర విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరులా ముగ్గురు దోషులు వేసిన పిటిషన్ మీద విచారణ జరిపారు.
కాగా, నిర్భయ దోషుల ఉరి ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకొని వంతుల వారీగా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్, రివ్యూ పిటిషన్లను ఒక్కొక్కరుగా దాఖలు చేస్తూ శిక్షను ఆలస్యం చేస్తున్నారు. మూడుసార్లు డెత్ వారంట్ జారీ చేసినప్పటికీ మరణ శిక్షను వాయిదా వేయించగలిగారు. ఇప్పుడు మరోసారి అదే ఉద్దేశంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
23 ఏళ్ల ఫిజియోథరపీ స్టూడెంట్ నిర్భయపై 2012 డిసెంబర్ 16న ఆరుగురు దోషులు... కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ని రక్తమోడేలా కొట్టారు. ఆ తర్వాత నిర్భయను నడిరోడ్డుపై బస్సులోంచీ విసిరేశారు. ఆ సమయంలో ఆమె బాయ్ ఫ్రెండే ఆమెను రోడ్డు ప్రమాదం నుంచీ కాపాడాడు. ఆ తర్వాత ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం సింగపూర్ తరలించినా... ఆమె బతకలేదు. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి... మైనర్ కావడంతో... మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగతా నలుగురు ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ కుమార్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ సింగ్ (31)కి ఉరిశిక్ష పడింది. ఐతే చట్టంలో లొసుగులును ఉపయోగించుకొని.. ఉరిశిక్షను మూడుసార్లు వాయిదాపడేలా చేశారు. నలుగురికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవకాశాలన్నీ పూర్తవడంతో ఉరిశిక్ష అమలుకానుంది. డెత్ వారెంట్స్ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు వారిని ఉరి తీస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi High Court, Nirbhaya case