హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

West Bengal : బెంగాల్ హింసపై సీజేకు లేఖ రాసిన 2000 మంది మహిళా అడ్వకేట్స్

West Bengal : బెంగాల్ హింసపై సీజేకు లేఖ రాసిన 2000 మంది మహిళా అడ్వకేట్స్

ఎన్వీ రమణ

ఎన్వీ రమణ

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల హింసపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళా అడ్వకేట్స్ స్పందించారు..ఈ హింసాత్మక సంఘటలనపై విచారణ జరపాలంటూ మొత్తం 2000 మంది మహిళ న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు.

ఇంకా చదవండి ...

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఉత్కంఠ నడుమ కొనసాగాయి...సీఎం మమతా బెనర్జిని ఎదుర్కొనేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నమే చేసింది..ఇందుకు దీటుగా దీదీ కూడ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ..ఎట్టకేలకు విజయం సాధించింది..అయితే అప్పటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే..ఎన్నికలతో పాటు ఎన్నికల అనంతరం కూడ ఈ హింసలు చెలరేగాయి..దీంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున పిల్లలు, మహిళలు,ముఖ్యంగా అణగారిన వర్గాలని కూడ చూడకుండా తీవ్రచిత్రహింసలు కొనసాగాయి..దీంతో అటు బీజేపీ ఇటు టీఎంసీ సైతం ఆందోళన వ్యక్తం చేశాయి..

దీంతో ఎన్నికల హింసకు మీరంటే మీరు కారణమని అధికార ,ప్రతిపక్ష పార్టీలు ఎదురుదాడులు చేసుకున్నాయి. ఈ హింసలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడిన పడిన సంఘటనలు ఉన్నాయి..అయితే ఇప్పుడు ఈ హింసలు రాజకీయం అయ్యాయి. ఎన్నికల తర్వతా మమతా బెనర్జి అధ్వర్యంలోనే హింస చెలరేగిందని బీజేపి ఆరోపించింది.

అయితే ఈ హింసలపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళ న్యాయవాదులు ఇప్పుడు స్పందించారు. ఇలాంటీ సంఘటనలు పునారావృతం కాకుండా భాద్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మహిళా న్యాయవాదులు ఓ లేఖ రాశారు. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై కమిటీ వేయాలని కోరుతు..2,093 మంది మహిళా న్యాయవాదులు సీజేఐకి లేఖ అందించారు. చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో వివరిస్తూ.. ఈ ఘటనలపై ఓ కమిటీ వేసి..కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Mamata Banarjee, West Bengal, West Bengal Assembly Elections 2021

ఉత్తమ కథలు