నది ఒడ్డున 2000 ఆధార్ కార్డులు... మూడు గోనె సంచుల్లో కుక్కి

గురువారం ఉదయం మూడు గోనె సంచులను స్థానికులు కనుగొన్నారు. వాటిని విప్పి చూడటంతో దాదాపు 2 వేల ఆధార్‌ కార్డులు కనిపించాయి.

news18-telugu
Updated: May 18, 2019, 10:44 AM IST
నది ఒడ్డున 2000 ఆధార్ కార్డులు... మూడు గోనె సంచుల్లో కుక్కి
ఆరుబయట 2వేల ఆధార్ కార్డులు
  • Share this:
ఏ ఆఫీసు పక్కనో... లేక ఆధార్ కార్డ్ సెంటర్ పక్కనో కాదు... ఓ నది పక్కన వేల సంఖ్యలో ఆధార్ కార్డులు బయటపడ్డాయి. అయితే అవన్నీ కాలం చెల్లినవో పనికిరానవో కాదు. మూడు నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలకు చేరాల్సిన ఆధారకార్డులవి. తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ముల్లియారు నది వద్ద పడి ఉన్న సుమారు 2 వేల ఆధార్‌ కార్డులను అక్కడి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టాఫీసు సిబ్బంది ద్వారా ఈ కార్డులన్నీ సంబంధిత వ్యక్తులకు చేరాల్సి ఉందని అధికారులు తెలిపారు. నది పక్కన కొంతమంది చిన్నారులు ఆడుకుంటుండగా వారికి కొన్ని ఆధార్‌కార్డులు, జూట్‌ బ్యాగుల్లో కొన్ని బండిళ్లు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం మూడు గోనె సంచులను స్థానికులు కనుగొన్నారు. వాటిని విప్పి చూడటంతో దాదాపు 2 వేల ఆధార్‌ కార్డులు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
భారీగా ఆధార్‌కార్డులు పడి ఉన్నాయన్న సమాచారం మేరకు తిరుథురాపూండికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడకు చేరుకుని వాటిలో తమ ఆధార్‌ కార్డులను వెతికి తీసుకున్నట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కట్టిమేడు, ఆతిరంగం, వడపతి, సెక్కల్‌ గ్రామాలకు చెందిన వారి గుర్తింపు కార్డులున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అవన్నీ రెండేళ్ల కిందట ముద్రించినవిగా గుర్తించారు. పోస్టులో వీటిని పొందని వారంతా ఆధార్‌ నమోదు సమయంలో తీసుకొన్న దరఖాస్తు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందినట్లు తెలిసింది.గ్రామ పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు