ప్రైవేటు ఉపాధ్యాయులకు రూ. 2000 ; సీఎం కేసీఆర్

ప్రైవేటు ఉపాధ్యాయులకు  రూ. 2000 ; సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ప్రైవేటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ. 2000 ఆర్ధిక సాయం సీఎం కేసీఆర్; మానవీయ కోణంలో ఆదుకునేందుకు నిర్ణయమన్న సీఎం ; సుమారు లక్ష నలబై అయిదు వేల మందికి లబ్ధి

  • Share this:
గత కొద్ది రోజులుగా ప్రవైటు స్కూళ్ల ఉపాధ్యాయులకు ఊరట కల్గించింది రాష్ట్ర్ర ప్రభుత్వం. స్కూళ్ల బంద్ తో ఉపాధ్యాయులపై భారం పడుతుందని వెంటనే స్కూళ్లను తెరవాలని రాష్ట్ర్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని ఆదుకునేందుకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు   ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబానికి 25 కేజీల ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ ఆర్ధిక సాయం స్కూళ్లు తెరిచే వరకు ప్రతినెల కొనసాగతుందని చెప్పారు.

ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం తెలిపారు.  ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సిఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరనుంది..
Published by:yveerash yveerash
First published: