ఆధునిక కాలంలో వికృత క్రీడ 'హింగోట్'.. 20 మందికి గాయాలు..

హింగోట్ క్రీడ..

Hingot : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి 55 కి.మీ.ల దూరంలో ఉన్న గౌతమ్‌పురా గ్రామంలో నిప్పుల యుద్ధాన్ని పోలిన క్రీడను ఆడుతారు.ఈ ఆటలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు 'హింగోట్‌లు' విసురుకుంటారు.

  • Share this:
    Hingot :  మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి 55 కి.మీ.ల దూరంలో ఉన్న గౌతమ్‌పురా గ్రామంలో నిప్పుల యుద్ధాన్ని పోలిన క్రీడను ఆడుతారు.ఈ ఆటలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు 'హింగోట్‌లు' విసురుకుంటారు. దీంతో ఈ ఆటలో ప్రతి సంవత్సరం 40 నుంచి 50 మంది ప్రజలు గాయాలపాలవుతుంటారు. కొంత మంది చనిపోతుంటారు కూడా.. అయినప్పటికీ ఈ క్రీడ పట్ల ప్రజలలో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతున్నదే కానీ తరగడంలేదు. దీనికితోడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ హింగోట్ యుద్ధాన్ని చూడటానికి తండోపతండాలుగా వస్తుంటారు.

    ఈ ఆట కోసం అక్కడి ప్రజలు అడవిలోని కొన్ని పొదలలో పండే హింగోట్ పండ్లను నెలరోజుల ముందు నుంచే సేకరించడం మొదలుపెడుతారు. ఆ తర్వాత ఆ పండ్లను మందుగుండుతో నింపుతారు. ఆ తర్వాత వాటిని వెదురు బొంగులకు కడతారు. ఈ హింగోట్ క్రీడ దీపావళి పండుగ రెండవరోజున జరుగుతుంది. ఈ ఆటలో కళంగ, టుర్ర అనబడే రెండు గ్రూపులుగా విడిపోయి ఆట మొదలు పెడుతారు. కాగా ఈ సంవత్సరం హింగోట్ యుద్దంలో 20 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

    First published: