తాను చనిపోతూ.. ఐదుగురిని బతికించిన 20 నెలల చిన్నారి..

Organ Donation: మొన్నటి వరకూ ఆడుతూ.. పాడుతూ తల్లిదండ్రులను ఆనందిపచేస్తూ గడిపిన ఆ 20 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆ చిన్నారి ఈ లోకాన్ని విడిచి వెళ్తూ మరో మరో ఐదుగురికి జీవితాన్ని ప్రసాదించింది.

news18-telugu
Updated: January 14, 2021, 8:23 PM IST
తాను చనిపోతూ.. ఐదుగురిని బతికించిన 20 నెలల చిన్నారి..
దనిష్తా ఫైల్ ఫొటో(Photo: Facebook)
  • Share this:
మొన్నటి వరకూ ఆడుతూ.. పాడుతూ తల్లిదండ్రులను ఆనందిపచేస్తూ గడిపిన ఆ 20 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆ చిన్నారి ఈ లోకాన్ని విడిచి వెళ్తూ మరో మరో ఐదుగురికి జీవితాన్ని ప్రసాదించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆశిశ్ కుమార్, బబితా దంపులకు కూతురు ధ‌నిష్తా. 20 నెలల ఆ చిన్నారి ఈ నెల 8న బాల్క‌నీలో నుంచి ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో గమనించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటిన గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతునన చిన్నారికి ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక తమకు దక్కదని తెలిసిన ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అంతటి బాధలోనూ తమ కూతురు అవయవాలను దానం చేయాలని భావించి తమ పెద్ద మనస్సు చాటు కున్నారు. ఆ చిన్నారి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాల‌ను ఐదుగురు పేషెంట్ల‌కు ఇచ్చారు. తమ పాప చ‌నిపోయినా ఆ ఐదుగురి నవ్వుల్లో జీవించే ఉంటుంద‌ని ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు చెబుతున్న తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Published by: Nikhil Kumar S
First published: January 14, 2021, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading