Home /News /national /

20 IN CHINA 12 IN TRINIDAD LEGAL MARRIAGE AGES ACROSS GLOBE AS INDIA MOVES TO RAISE CEILING FOR WOMEN NS GH

Legal Marriage Age: చైనాలో 20, ట్రినిడాడ్ లో 12... ప్రపంచ వ్యాప్తంగా మహిళల కనీస వివాహ వయసు ఎంతంటే..

చైనాలో 20, ట్రినిడాడ్ లో 12... ప్రపంచ వ్యాప్తంగా మహిళల కనీస వివాహ వయసు ఎంతంటే..

చైనాలో 20, ట్రినిడాడ్ లో 12... ప్రపంచ వ్యాప్తంగా మహిళల కనీస వివాహ వయసు ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా అబ్బాయిల సగటు కనీస వివాహ వయసు 17 ఏళ్లు కాగా.. అమ్మాయిల వయసు 16 ఏళ్లు. ఈ కనీస వివాహ వయసు అనేది దేశాలను బట్టి మారుతుంటుంది. కొన్ని దేశాల్లో కనీస వివాహ వయసు చాలా తక్కువగా ఉంటుంది. మరి ఏయే దేశాల్లో ఈ పరిమితి ఎలా ఉందో చూద్దాం.

ఇంకా చదవండి ...
అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు దాటితేనే పెళ్లి చేయాలనే చట్టం భారత దేశంలో అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల కనీసం వివాహ వయసు కూడా పెంచాలని కొంతకాలంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళల కనీస వివాహ వయసును 21కి పెంచేలా ప్లాన్ చేశామని నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు. అయితే తాజాగా మహిళల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కనీస వివాహ వయసుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అబ్బాయిల సగటు కనీస వివాహ వయసు 17 ఏళ్లు కాగా.. అమ్మాయిల వయసు 16 ఏళ్లు. ఈ కనీస వివాహ వయసు అనేది దేశాలను బట్టి మారుతుంటుంది. కొన్ని దేశాల్లో కనీస వివాహ వయసు చాలా తక్కువగా ఉంటుంది. మరి ఏయే దేశాల్లో ఈ పరిమితి ఎలా ఉందో చూద్దాం.
Marriage age of women: 18 కాదు 21.. అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం..

ఎస్టోనియా - 15 ఏళ్లకే పెళ్లి
యూరోపియన్ దేశం ఎస్టోనియాలో యువతీ యువకులు 15 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు. అయితే వీరు తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది.
యునైటెడ్ కింగ్డమ్
ఇంగ్లాండ్, వేల్స్‌లో నివసించే టీనేజర్లు తమ 18 ఏళ్ల వయసులో లేదా తల్లిదండ్రుల సమ్మతితో 16 లేదా 17 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవచ్చు.
PM Modi: అగ్రరాజ్య అధినేతలు.. బాలీవుడ్ బిగ్ బాస్ లు ఔట్.. ప్రపంచంలో మోదీ ప్లేస్ ఎంతంటే..?


ట్రినిడాడ్ & టొబాగో
కరేబియన్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశంలో అధికారిక వివాహ వయసు అమ్మాయి, అబ్బాయిలకు 18 సంవత్సరాలు. అయితే ఇక్కడ ముస్లింలు, హిందువులకు సొంత వివాహ చట్టం ఉంటుంది. ఇక్కడ ముస్లిం అబ్బాయిలకు కనీస వివాహ వయసు 16 కాగా అమ్మాయిల వయసు కేవలం 12 ఏళ్లే! హిందువులు 18, 14 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవచ్చు.

యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోవచ్చు. అయితే నెబ్రాస్కాలో వివాహ వయసు 19 ఏళ్లు కాగా మిసిసిపీలో వివాహ వయసు 21 ఏళ్లగా ఉంటుంది. మసాచుసెట్స్ ప్రభుత్వం 12 ఏళ్లలోపు బాలికలను న్యాయమూర్తి అనుమతితో అసాధారణ పరిస్థితులలో వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది.

చైనా
చైనాలోని పురుషులకు చట్టబద్ధమైన వివాహ వయసు 22 ఏళ్లు కాగా మహిళలకు 20 ఏళ్లు. ఈ వయోపరిమితిని తగ్గించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో పెరుగుతున్నాయి.

నైగర్‌లో బాల్య వివాహాలు చట్టబద్ధం
ఆఫ్రికాలోని నైగర్‌ దేశ సివిల్ కోడ్ ప్రకారం, అబ్బాయిలకు కనీస వివాహ వయసు 18 ఏళ్లు, బాలికలకు 15 ఏళ్లు. అయితే ఈ దేశంలో బాల్య వివాహాలు అత్యధికంగా ఉంటుందని యూనిసెఫ్ ఇంతకుముందు వెల్లడించింది. ఇక్కడ పేద అమ్మాయిలు బాల్య వయసులోనే పెళ్లి చేసుకుంటారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Marriage

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు