అసోంలో విరిగిపడిన కొండచరియలు... 20 మంది మృతి...

వానాకాలం రాకముందే... ప్రకృతి విపత్తులు మొదలయ్యాయి. ఇక వర్షాకాలం వచ్చాక... ఎలాంటి విషాదాలు జరుగుతాయో...

news18-telugu
Updated: June 2, 2020, 2:08 PM IST
అసోంలో విరిగిపడిన కొండచరియలు... 20 మంది మృతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణ అసోంలోని బరాక్ లోయ ప్రాంతంలో... ఇవాళ మూడు వేర్వేరు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తుల్లో... దాదాపు 20 మంది చనిపోగా... మరికొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే... కరోనా సహాయ చర్యలు పక్కన పెట్టి... రెస్క్యూ టీమ్స్... ఈ కొండ చరియల్ని తొలగించే ఆపరేషన్ ప్రారంభించింది. బండరాళ్ల కింద ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. చనిపోయిన వారిలో... ఏడుగురు కచార్ జిల్లాకు చెందిన వారు. మరో ఏడుగురు హైలకండి జిల్లాకు చెందినవారు. మరో ఆరుగురు కరిమ్‌గంజ్ జిల్లాకు చెందిన వారని తెలిసింది.

కొండ చరియలు విరిగిపడటానికి ఇక్కడ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలే కారణం అని అధికారులు తెలిపారు. ఇంకా వర్షాకాలం రాకపోయినా... ఇటీవల ఇక్కడ ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల భారీ వర్షాలు కురిశాయని వివరించారు.

ఈ ఈశాన్య రాష్ట్రంలో ఇప్పటికే తరచూ వరదలు వచ్చి... 3.72 లక్షల మంది బాధితులయ్యారు. ముఖ్యంగా గోల్పారా జిల్లా... అత్యంత ఎక్కువగా దెబ్బతింది. ఆ తర్వాత నాగావ్, హోజాయ్ జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే... నైరుతీ రుతుపవనాలు వచ్చాక... ఇంకెన్ని విషాదాలు జరుగుతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
First published: June 2, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading