స్వస్థలాలకు వెళ్లేందుకు తిప్పలు.. సైకిళ్లపైనే ఉత్తరప్రదేశ్‌కి పయనం..కానీ మధ్యలోనే..

హైదరాబాద్ నగరానికి వలసొచ్చిన భవన నిర్మాణ కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సైకిళ్ల మీద బయలుదేరారు. కుషాయిగూడ పోలీసులు చర్లపల్లి సమీపంలో అడ్డుకోవడంతో వారి ప్రయాణం ఆగిపోయింది.

news18-telugu
Updated: March 29, 2020, 8:37 AM IST
స్వస్థలాలకు వెళ్లేందుకు తిప్పలు.. సైకిళ్లపైనే ఉత్తరప్రదేశ్‌కి పయనం..కానీ మధ్యలోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఆయా రాష్ట్రాల సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఎటూ ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. అయితే హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అవస్థులు పడుతున్నారు. కరోనా వైరస్ సోకే ప్రమాదముందని బయటకు రావొద్దని పోలీసులు చెబుతున్నా.. మేం ఇక్కడే ఇరుక్కుపోతాం అన్న ఆందోళనలో కూలీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏలాగైనా స్వస్థలాలకు వెళ్లాలని కొంతమంది కాలినడకన వెళ్తుండగా, మరికొంతమంది సైకిళ్లపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారే వీళ్లంతా.

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది కూలీలు వలసొచ్చారు. లాక్‌డౌన్ కారణంగా అన్నీ మూతపడడంతో పైసా పని దొరకడం లేదు. తినేందుకు తిండికి ఇబ్బందులు పడాల్సి రావడం.. లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుందోనన్న భయంతో వలసొచ్చిన కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అందుకే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 మంది కార్మికులు తమ స్వస్థలాలకు సైకిల్స్‌పై వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే శనివారం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

నాగారం, కీసర ఔటర్ రింగురోడ్డు మీదుగా హైవే ఎక్కి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. కానీ చర్లపల్లి డివిజన్ చక్రీపురం చౌరస్తా వద్దకు చేరుకోగానే కుషాయిగూడ పోలీసులు వీరిని అడ్డగించారు. దీంతో కూలీలు తమకు పనులు లేక తిండి తినేందుకే కష్టంగా ఉందని, అందుకే తమ ఊళ్లకు వెళ్లిపోతున్నట్టు పోలీసులకు తెలిపారు. సరిహద్దులన్నీ మూసేశారని ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లడం కష్టమని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండొచ్చని, భోజనం సైతం ఉచితంగానే పెడతారని నచ్చజెప్పి కూలీలను కుషాయిగూడకు తరలించారు.
First published: March 29, 2020, 8:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading