హోమ్ /వార్తలు /జాతీయం /

పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం..

పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం..

ప్రతీకాత్మక చిత్రం (Image:ANI/Twitter)2

ప్రతీకాత్మక చిత్రం (Image:ANI/Twitter)2

Pulwama Encounter : పుల్వామాలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.

    జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. పుల్వామా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను మరోసారి నిలిపివేశారు.


    కాగా, ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు అమరులవడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్‌లోని జైషే మహమ్మద్ శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు పాల్పడింది. అప్పటినుంచి అడపాదడపా కశ్మీర్ సరిహద్దులో కాల్పుల మోత మోగుతూనే ఉంది.
    First published:

    Tags: India VS Pakistan, Jammu and Kashmir, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు