Home /News /national /

2 PERSONS FROM OUTSIDE JAMMU AND KASHMIR HAVE BOUGHT PROPERTY SINCE 370 MOVE SAYS CENTRE SK

Jammu and Kashmir: ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్‌లో ఇద్దరే ఆస్తులు కొన్నారు.. ఎందుకిలా? అంచనాలు ఎందుకు తప్పాయి?

జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ మ్యాప్

జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ మ్యాప్

Jammu and Kahmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు 520 మంది వలస కార్మికు తిరిగి కాశ్మీర్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ-2015 కింద అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

    జమ్మూ కాశ్మీర్‌‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. జమ్మూకాశ్మీర్ పూర్తి స్థాయిలో భారత్‌లో కలిసిందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కొందరు సమర్థించారు. చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దుతో.. అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకాశ్మీర్‌లోనూ ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కానీ ఆర్టికల్ 370 రద్దై రెండున్నరేళ్లు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు ఇంకా ఏమీ మారలేదని తాజాగా తెలిసింది. ఈ రెండున్నరేళ్లలో ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులే అక్కడ ఆస్తులు కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ మంగళవారం ఈ ప్రకటన చేశారు.

    జమ్మూకశ్మీర్‌కు 370 అధికరణను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 5 ఆగస్టు 2019 ఆగస్టులో జమ్మూ అండ్ కాశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఐతే ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉండేవి. కశ్మీర్‌ ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందిన బయటి వ్యక్తులు ఆస్తుల కొనుగోళ్లు చేయడంపై నిషేధం అమల్లో ఉండేది. కేవలం కాశ్మీర్ ప్రజలకు మాత్రమే ఆస్తులను కొనుగోలు చేసే హక్కులు ఉండేవి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. జమ్మూకాశ్మీర్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమయింది. ఇతర రాష్ట్రాల మాదిరే.. అక్కడా భారతీయులెవరైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. అక్కడి వాతావరణం, పర్యాటక ప్రాంతాల నేపథ్యంలో బయటి వ్యక్తులు పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేస్తారని కేంద్రం భావించింది. కానీ వాస్తవానికి వారు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కేవలం ఇద్దరంటే ఇద్దరు బయటి వ్యక్తులు మాత్రమే అక్కడ ఆస్తులను కొనుగోలుచేశారు.

    జమ్మూ కశ్మీర్‌, లడ్డాఖ్‌లో దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఆస్తులు కొనుగోలు చేయకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. 370 రద్దును కశ్మీర్‌ ప్రాంత ప్రజల్లో చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా తప్పుబట్టారు. అంతేకాదు ఉగ్రదాడులు, అల్లర్లతో అట్టుడికే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఎవరూ ఆస్తుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు కూడా వెనకడుగు వేస్తున్నారు. దీనికి తోడు గత ఏడాది మార్చి నుంచి మనదేశంలో కరోనా విరుచుకుపడింది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ కరోనా పరిస్థితులు కూడా ఒక కారణమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐతే ఆస్తుల కొనుగోళ్ల దరఖాస్తులకు సంబంధించి జమ్మూకాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ వద్ద ఉన్న పెండింగ్‌ల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు 520 మంది వలస కార్మికు తిరిగి కాశ్మీర్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ-2015 కింద అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఆస్తుల కొనుగోళ్లు ప్రక్రియ ఊపందుకుంటుందని కేంద్రం భావిస్తోంది. పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తాయని ఆశిస్తోంది.

     



    ఇవి కూడా చదవండి:

    Venkaiah Naidu: రాజ్యసభలో కంటతడి పెట్టిన వెంకయ్యనాయుడు..

    Covid: ఇండియాలో మళ్లీ జోరుగా కరోనా... భారీగా కొత్త కేసులు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Article 370, Jammu and Kashmir

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు