ఊరిలోకి వచ్చిన చిరుత.. ప్రజలేం చేశారంటే..

ఓ చిరుతపులి తకుర్‌ద్వారా అనే గ్రామంలోకి వచ్చింది. అది చూసిన గ్రామస్తులు భయంతో చిరుతపులిపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో చిరుతపులి గ్రామస్తులపై దాడి చేసి ఇద్దరిని గాయపర్చింది.

news18-telugu
Updated: July 12, 2020, 7:51 AM IST
ఊరిలోకి వచ్చిన చిరుత.. ప్రజలేం చేశారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రజలందరూ ఇళ్లకి పరిమితం.. బయట పెద్దగా సంచారాం లేకపోవడంతో అడవి జంతువులు గ్రామాల బాటపట్టాయి. ఈ క్రమంలోనే చిరుతపులులు, అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు ఇంతకుముందే వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులిచ్చింది. దీంతో జనసంచారం సాధారణ స్థితికి చేరుకుంది. అయినా అడవి జంతువులు జనావాసాల్లోకి అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. తాజాగా యూపీలో ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది. ఊరిలోకి రాగానే ప్రజలు కన్పించగానే వారిపై దాడికి దిగింది. దీంతో అప్రమత్తమైన ప్రజలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది. అనంతరం రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది దాన్ని పట్టుకుని బోనులో బంధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో ఓ చిరుతపులి తకుర్‌ద్వారా అనే గ్రామంలోకి వచ్చింది. అది చూసిన గ్రామస్తులు భయంతో చిరుతపులిపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో చిరుతపులి గ్రామస్తులపై దాడి చేసి ఇద్దరిని గాయపర్చింది. గ్రామస్తులు చేసిన రాళ్ల దాడిలో చిరుతపులి సైతం తీవ్ర గాయాలు కావడంతో అది అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనస్థలానికి చేరుకున్నారు.

చిరుత పులిని అత్యంత చాకచక్యంగా అటవీ సిబ్బంది పట్టుకుని బోనులో బంధించారు. చిరుతకు చికిత్స చేసిన దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అటవీ అధికారులు తెలిపారు. కాగా చిరుత దాడిలో గాయపడిన గ్రామస్తులను ఆస్పత్రికి తరలించారు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 7:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading