Home /News /national /

2 KILLED AND 15 INJURED AFTER MASSIVE FIRE ON 18TH FLOOR OF MUMBAI TARDEO HIGH RISE MKS

Mumbai High Rise Fire: భారీ భవంతి 18వ అంస్తులో మంటలు.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు

ముంబైలో అగ్నిప్రమాదం

ముంబైలో అగ్నిప్రమాదం

సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని నివాస భవనంలోని 18వ అంతస్తులో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. వివరాలివి..

ముంబై మహానగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 20 అంతస్తుల భారీ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మటలు చెలరేగాయి. 18వ అంతస్తులోని పలు ఫ్లాట్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. చాలా మందికి గాయాలు కాగా, ఇంకొందరు పొగ వల్ల ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాద ఘటనపై బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు స్పందించారు.

సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని నివాస భవనంలోని 18వ అంతస్తులో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. స్థానిక గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల అపార్ట్మెంట్ కమల భవనంలో శనివారం ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి పరుగులు తీశారు..

Nakkapalle: అన్నయ్యా.. ప్లీజ్ వదులన్నా.. నోట్లో గుడ్డలు కుక్కి.. తల్లి, సోదరి నగ్న వీడియోలు కావాలంటూ.. విశాఖలో దారుణం



కమల భవనం అపార్ట్మెంట్ వద్దకు 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలతో చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఇది లెవల్-3 అగ్నిప్రమాదంగా అధికారులు చెప్పారు. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, గాయపడ్డవారిని, శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించారు.

Prashant Kishor కాంగ్రెస్‌లో చేరేవారే: అసలేం జరిగిందో చెప్పిన Priyanka Gandhi



‘అగ్ని ప్రమాదం తర్వాత ఆస్పత్రుల్లో చేరినవారిలో ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైందని, మంటలు అదుపులోకి వచ్చినా పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయని, ప్రజలందరినీ రక్షించామని ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ తెలిపారు. ఘటన దురదృష్టకరమని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంగళ్ ప్రభాత్ లోధా అన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Fire Accident, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు