దేశం రిపబ్లిక్ డే వేడుకలకు సిద్దమవుతున్నవేళ.. రాజధాని ఢిల్లీలో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారు. అయితే ఢిల్లీ పోలీసుల చాకచక్యంతో ఈ ఉగ్రకుట్ర భగ్నమైంది. కుట్రకు పాల్పడిన ఇద్దరు జైషే-మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు.
పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని వకురా, బటపోరా ప్రాంతాలకు చెందిన అబ్దుల్ లతీఫ్, అలియాస్ దిలావర్(29), హిలాల్ అహ్మద్ భట్(26)గా గుర్తించారు. కుట్రను అమలుచేయడంలో భాగంగా.. గురువారం రాజ్‌ఘాట్ సమీపంలో కొంతమంది వ్యక్తులను కలవడానికి దిలావర్ వచ్చాడని, పక్కా సమాచారంతో అక్కడికెళ్లి అతన్ని పట్టుకున్నామని చెప్పారు.
విచారణలో తామిద్దరం జైషే మహమ్మద్‌కి చెందిన ఉగ్రవాదులుగా వారు అంగీకరించారు. పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ టీమ్స్‌తో తాను టచ్‌లో ఉన్నట్టు దిలావర్ పోలీసులతో తెలిపాడు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వారితో కమ్యూనికేట్ అవుతున్నట్టు చెప్పాడు. పాకిస్తాన్ జైషే మహమ్మద్ టీమ్‌కి చెందిన అబు మౌజ్ తనకు డజన్ల కొద్ది గ్రనేడ్స్, పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జెస్ ఇచ్చినట్టు తెలిపాడు.
రిపబ్లిక్ డే వేడుకల వేళ పేలుళ్లు జరపడం కోసం వీఐపీలు ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాల్సిందిగా దిలావర్‌కు మౌజ్ నుంచి ఆదేశాలు కూడా అందాయని పోలీసుుల నిర్దారించారు. వీఐపీ ప్రాంతాలతో పాటు పోష్ మార్కెట్స్, గ్యాస్ పైప్ లైన్ వంటి ప్రాంతాలను టార్గెట్ చేయాలని చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, 2016లో గండర్బాల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినందుకు గాను గతంలో దిలావర్పై రెండు కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Jammu and Kashmir, New Delhi, Terrorism