ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం... ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు

దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఉగ్రదాడికి యత్నిస్తున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

news18
Updated: November 17, 2020, 12:49 PM IST
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం... ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 17, 2020, 12:49 PM IST
  • Share this:
దేశ రాజధానిలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని సరయ్‌ కాలేఖాన్‌ ఏరియాలో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకులు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాలేఖాన్ ఏరియాలో తీవ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం.. రాజధాని వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. సోమవారం రాత్రి పక్కా ప్రణాళిక చేపట్టి.. సరయ్‌ కాలే ఖాన్‌ ప్రాంతంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌కు చెందిన అబ్దుల్‌ లతిఫ్‌ మీర్‌, అష్రఫ్‌‌ ఖటానాగా గుర్తించారు. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు పనిచేస్తున్న వీరు.. గతంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారని.. ఆ సమయంలో భారత ఆర్మీ వీరిని అడ్డుకున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఢిల్లీలో దాడులు జరిపి ఆ తర్వాత నేపాల్‌ మీదుగా పీఓకే వెళ్లాలని వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తున్నది. కాగా.. ఈ కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం పట్టుబడిన ఉగ్రవాదులను విచారిస్తున్నారు.

గత ఆగస్టులో కూడా ఇలాంటి కుట్రను దేశ రాజధాని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో దౌలా ఖాన్‌ ప్రాంతంలో ఓ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 15 కేజీల అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: November 17, 2020, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading